Begin typing your search above and press return to search.
జీతాలపై ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 1 April 2020 7:15 AM GMTకరోనా కారణంగా కిందామీదా పడుతున్న ఆర్థిక పరిస్థితులతో పాటు.. రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు భారీగా పడిపోయిన వేళ.. తెలంగాణ ప్రభుత్వం జీతాల కోతపై తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేని వేళ.. కఠిన నిర్ణయాలు తీసుకునే విషయంలో తాను వెనుకాడనన్న విషయాన్ని చెప్పేశారు.
తనతో సహా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో సహా అన్ని రకాల ప్రజాప్రతినిధుల జీతాల్లో వందశాతం కోత పెట్టేశారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేకాదు.. ఐఏఎస్.. ఐపీఎస్.. ఐఎఫ్ఎస్ తదితర అఖిల భారత సర్వీసుల్లోపని చేసే ఉద్యోగుల జీతాల్లో 60 శాతం కోతను విధించాయి. ఇతర అన్ని క్యాడర్ల ఉద్యోగస్తులకు యాభై శాతం కోత పెట్టగా.. నాలుగో తరగతి ఉద్యోగులకు పది శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఏ శాఖలో పని చేసిన రిటైర్ అయినా.. మిగిలిన ఉద్యోగులకు ఏ రీతిలో అయితే కోత పెట్టారో.. అదే దామాషాలోనే పెన్షన్ల లో కోత ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే జీతాల బిల్లుల్ని సిద్ధం చేసిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తగ్గట్లు.. జీతాలు ఇవ్వనున్నారు.