Begin typing your search above and press return to search.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి అగ్రస్థానం !

By:  Tupaki Desk   |   5 Sept 2020 8:00 PM IST
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి అగ్రస్థానం !
X
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో రెండు తెలుగు రాష్ట్రాలు మరోసారి సత్తా చాటుకున్నాయి. తాజాగా ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. నేషనల్, ఇంటర్నేషనల్ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి, రాష్ట్రాల మధ్య పోటీని సృష్టించడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం స్టేట్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ – 2019 ని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. రాష్ట్రాల మధ్య వ్యాపారంలో పోటీతత్వాన్ని పెంచే ఉద్దేశంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ ఇండెక్స్‌ ని రూపొందించారు. ఆర్థిక అభివృద్ధి, పరిపాలన, కార్మిక చట్టాల్లో చేపడుతున్న సంస్కరణల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయిస్తారు.

2018 సంవత్సరంలో ఇలా ర్యాంకింగ్స్ ఇవ్వడం మొదలేట్టారు. తాజాగా 2019కి గాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్స్ ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, విమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ ర్యాంకింగ్‌ ను విడుదల చేశారు. యా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వాణిజ్య సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా ఇవ్వడం జరిగిందని మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. సింగిల్ విండో వ్యవస్థ ద్వారా , కార్మిక చట్టాల్లో సంస్కరణలు, వివాదాల చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడం ద్వారా వ్యాపార నియంత్రణను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలపై ప్రతికూల ప్రభావం పడితే భారత్ మాత్రం శక్తివంతమైన దేశంగా అవతరిస్తోందని, ప్రధాని మోదీ స్వావలంబన భారత్ నినాదం ఇందుకు కారణమని ఆయన వివరించారు. ప్రపంచ వేదికపై భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.