Begin typing your search above and press return to search.

సంక్షోభం దిశ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. చంద్ర‌బాబు ఫైర్‌

By:  Tupaki Desk   |   6 April 2022 12:00 AM GMT
సంక్షోభం దిశ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. చంద్ర‌బాబు ఫైర్‌
X
రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న అప్పులు తీర్చేందుకు ప్రజల నుంచి విచ్చలవిడిగా పన్నులు వసూలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పథకాల పేరిట 10 శాతం ఇస్తూ.. ప్రజల నుంచి 90 శాతం దోచేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. గతంలో సంక్షేమ పథకాలతో సుభిక్షంగా ఉన్న రాష్ట్రం... ఇప్పుడు సంక్షోభం దిశగా పయనిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న అప్పులు తీర్చేందుకు ప్రజల నుంచి విచ్చలవిడిగా పన్నులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పథకాల పేరిట 10 శాతం ఇస్తూ.. ప్రజల నుంచి 90 శాతం దోచేస్తున్నారని ధ్వజమెత్తారు.

పన్నులు, విద్యుత్‌ ఛార్జీ మోత తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ఒక్కో కుటుంబంపై ఏడాదికి లక్ష రూపాయలకు పైగా భారం పడుతోందన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైసీపీ పాలనపై ప్రజలంతా పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

"గతంలో సంక్షేమాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండేది. ఇప్పుడు రాష్ట్రం సంక్షోభం దిశగా పయనిస్తోంది. పన్ను, విద్యుత్‌ ఛార్జీలతో ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. వైసీపీ బాదుడే బాదుడు విధానంతో అల్లాడుతున్నారు. ఒక్కో కుటుంబంపై ఏడాదికి రూ.లక్షకుపైగా భారం పడుతోంది. చేసిన అప్పులు తీర్చేందుకు ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. పథకాల మాటున 10 శాతం ఇచ్చి 90 శాతం దోచేస్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైసీపీపాలనపై ప్రజలంతా పోరాడాలి.`` అని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

మంగ‌ళ‌వారం ఆయ‌న వీడియో సందేశం విడుద‌ల చేశారు. ఇటీవ‌ల పెంచిన విద్యుత్ చార్జీలు, పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు, ప‌న్నుల పెంపు, చెత్త ప‌న్ను.. వంటి అంశాల‌ను ప్ర‌ధానంగా ఆయ‌న ప్ర‌స్తావించారు. ఇప్ప‌టికే సామాన్యుల జీవితాలు.. అల్ల‌క‌ల్లోలం అయ్యాయ‌ని, ఇప్పుడు మ‌రింత‌గా దిగ‌జారిపోతున్నాయ‌ని.. జ‌గ‌న్ మాత్రం ప్యాలెస్ విడిచి బ‌య‌ట‌కు కాలు పెట్ట‌డం లేదని చంద్ర‌బాబు విమ‌ర్శించారు.

అంతేకాదు.. అప్పులు చేస్తూ.. రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్న జ‌గ‌న్‌.. ఎప్పుడో ఒక‌ప్పుడు రాష్ట్రాన్ని శ్రీలంక మాదిరిగా చేసేయ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లు స్పందించి.. జ‌గ‌న్ స‌ర్కారుపై యుద్ధం ప్ర‌క‌టించాల‌ని అన్నారు. త్వ‌ర‌లోనే తాను జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు పేర్కొన్నారు.