Begin typing your search above and press return to search.
ఆంధ్ర, ఒడిశా బిగ్ ఫైట్ తప్పదా?
By: Tupaki Desk | 7 Jan 2016 11:55 AM GMTపోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. దక్షిణ ఒడిశా అంతా బంద్ పాటించారు. ఆంధ్ర సరిహద్దుల్లోని ఒడిశా పట్టణాల్లో భారీ ఎత్తున ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఈరోజు జరుపుతున్న ఆందోళన కోసం వారం రోజులుగా అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. సాక్షాత్తు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఈ నిరసనలను ప్రమోట్ చేశారు. పాలక బీజేడీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనూ దీనిపై పోస్టింగులు పెడుతున్నారు. ఒడిశా గవర్నమెంటు దీనిపై తీసుకున్న స్టాండ్ చూస్తుంటే రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరినట్లే కనిపిస్తోంది.
ఆందోళనల కారణంగా ఏపీ సరిహద్దుల్లో ఉన్న కొరాపుట్, గుణుపూర్, జయపూర్, రాయగడ, పర్లాకిమిడి, బరంపూర్ తదితర పట్టణాలన్నీ బీజేపీ ప్రదర్శనలతో హడావుడిగా కనిపించాయి. కొరాపుట్-విశాఖ పాసింజరు రైలును నిలిపివేశారు. ఒడిశా, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఆంధ్రలో ప్రవేశించడానికి ముఖద్వారమైన సుంకి గేటు వద్ద పెద్ద సంఖ్యలో లారీలను ఆపేసి ఆంధ్రకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అటు పర్లాకిమిడి, బరంపురం మార్గాల్లో వచ్చేవాహనాలనూ ఆంధ్రలోకి వెళ్లకుండా అడ్డుకుని నిరసన తెలిపారు. రైళ్లకు అంతరాయం కలిగించడంతో ఆలస్యంగా నడుస్తున్నాయి. పార్వతీపురం-రాయగడ, శ్రీకాకుళం-జయపూర్, శ్రీకాకుళం-రాయగడ, పార్వతీపురం- నారాయణపూర్ ల మధ్య బస్సు సర్వీసులను ఏపీఎస్ ఆర్టీసీ రద్దు చేసుకుంది.
అధికార పార్టీ చేపట్టిన ఆందోళన కావడంతో పెద్ద ఎత్తున జరిగింది. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా పోలవరాన్ని నిర్మిస్తే చూస్తూ ఊరుకోబోమని బీజేడీ నేతలు నినాదాలు చేశారు. 1980లో చేసుకున్న ఒప్పందం ప్రకారం పోలవరం ప్రాజెక్టు ఎత్తు 150 అడుగులకే పరిమితం కావాలన్నది వారి వాదన... అయితే.. ఏపీ ఇప్పుడు 180 అడుగుల ఎత్తున ఆనకట్ట కడుతోందని దానివల్ల ఒడిశాలో పెద్ద సంఖ్యలో గిరిజన గ్రామాలు మునిగిపోతాయని ఆ రాష్ట్రం వాదిస్తోంది.
అంతేకాదు... పోలవరాన్ని ఒకే ప్రాజెక్టుగా కడితే మొత్తం 302 గ్రామాలు మునిగిపోతాయని... అలా కాకుండా మూడు ఆనకట్టలుగా కట్టుకుంటే కేవలం 74 గ్రామాలే మునుగుతాయని... అందుకు తాము సిద్ధమేనని.. మూడు ఆనకట్లలుగా కట్టుకోవాలని ఒడిశా ప్రతిపాదిస్తోంది. ఈ వివరాలతో ప్రధానినీ కలిశారు. అయినా కేంద్రం నుంచి స్పందన లేదని.. ఏపీ కూడా ఏ వివరాలు ఇవ్వకుండా ఏకపక్షంగా కట్టుకుంటూ పోతోందని ఒడిశా ఆరోపిస్తోంది. కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదని... మునిగిపోతున్న ఒడిశా గ్రామాల్లో గ్రామసభలు కూడా నిర్వహించలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు దీనిపై ఒడిశా సీఎం నవీన్ కూడా గట్టి పట్టుదలతో కనిపిస్తున్నారు. ''ఏం చేసైనా సరే ఒడిశా గిరిజనుల ప్రయోజనాలను కాపాడుతాను" అని ఆయన ట్వీట్ చేశారు.