Begin typing your search above and press return to search.
పనికిమాలిన ‘పెద్ద’రికం
By: Tupaki Desk | 13 May 2016 11:48 AM GMTదేశ చట్టసభల్లో రాజ్యసభకు - అందులో ఉన్న సభ్యులకు ఉన్నగౌరవమే వేరు. పెద్దల సభగా పేరున్న రాజ్యసభ మేధావులు - ప్రజాసంక్షేమ కాముకులు - దేశాభివృద్ధికి మార్గ నిర్దేశం చేసే గొప్ప వ్యక్తులకు నిలయంగా భావిస్తారు. కానీ... పెద్దల సభ రూపం రానురాను మారిపోతోంది. సెలబ్రిటీలు - వ్యాపారవేత్తల అడ్డాగా మారుతోంది. రాజకీయ పునరావాస కేంద్రంగానూ రాజ్యసభను మార్చేస్తున్నారు. దీంతో ప్రజలతో సంబంధాలు లేనివారు. ప్రజాసమస్యలపై అవగాహన లేనివారు.. అసలు దేశ చరిత్ర - దేశ అవసరాలు ఏమిటో కూడా తెలియనివారు... దార్శినికత బొత్తిగా లేనివారితో రాజ్యసభ నిండిపోతోంది. ఫలితంగా రాజ్యసభలో ప్రజాకోణం, దేశ ప్రయోజనం అన్నవి మచ్చుకైనా కనిపించడం లేదు. అన్ని రాష్ట్రాల నుంచి ఈ సభకు ఎంపికవుతున్నవారి పరిస్థితి ఇలాగే ఉంది. వంద మందిలో ఒకరిద్దరు మినహా మిగతావారంతా ఇదే బాపతు. కేవలం కొద్దిమంది మహానుభావుల వల్ల మాత్రమే రాజ్యసభకు ఇంకా పెద్దల సభగా గౌరవం దక్కుతోందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
ఇక పెద్దల సభలో ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం చూసుకుంటే ఇక్కడి నుంచి వెళ్లినవారిలో కొందరు రాష్ట్రేతరులు.. మరికొందరు వ్యాపారవేత్తలు... ఇక రాష్ట్రానికి చెందినవారు ఉన్నప్పటికీ వారికి రాష్ట్ర ప్రయోజనాలన్నవి పట్టడం లేదు. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారిలో ప్రస్తుతం పదవీ కాలం ముగుస్తున్న నలుగురిని చూసుకున్నా కూడా వారి వల్ల రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం శూన్యమనే చెప్పాలి.
జైరాం రమేష్....
కాంగ్రెస్ పార్టీకి చెందిన జైరాంది కర్ణాటక. తన పదవీకాలంలో ఈయనెప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాట్లాడిన సందర్భమే లేదు. ప్రయోజనాల సంగతి పక్కనపెడితే ఆంధ్రప్రదేశ్ ను విభజించిన పాపంలో ఈయన భాగస్వామ్యం తక్కువేం కాదు. సమైక్య రాష్ట్రాన్ని విభజించడంలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేశ్ పెద్దల సభ వేదికగా ఏపీకి తీరని అన్యాయం చేశారనే చెప్పుకోవాలి.
నిర్మలా సీతారామన్...
ఈమె కూడా తెలుగు వ్యక్తి కారు. తమిళనాడుకు చెందిన నిర్మల ఆంధ్రప్రదేశ్‌కి కోడలు. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నా కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కోసం ఏమాత్రం సహకారం అందించడంలేదు. ఏపీ ప్రజల మనోవాంఛ అయిన ప్రత్యేక హోదా గురించి ఈమె ఇంతవరకు పెదవి విప్పిందే లేదు. తనను పెద్దల సభకు పంపి, కేంద్ర మంత్రి అయ్యే అర్హత అందించిన ఆంధ్రప్రదేశ్ రుణం తీర్చుకోనవసరం లేదు.. కానీ, రుణ ఊబిలో చిక్కుకుపోయిన రాష్ట్రానికి కాస్తంత ఉపశమనం కలిగించే చర్యలు కూడా తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేలేదు.
సుజనా చౌదరి...
పేరుకు ఈయన ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తే అయినా రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలపైనే దృష్టి ఎక్కువ. ఈయన కూడా కేంద్ర మంత్రిగా ఉన్నా రాష్ట్రం తరఫున మాట్లాడడం మానేసి కేంద్రానికి వత్తాసు పలుకుతుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు - బ్యాంకులకు రుణాల ఎగవేతలు వంటి కేసుల్లో ఇరుక్కుని ఆంధ్రప్రదేశ్ ది - పెద్దల సభది రెండింటి పరువు ఒకేసారి తీసేశారు.
జేడీ శీలం..
కాంగ్రెస్ కు చెందిన ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందినవారే. కానీ... సమైక్యాంధ్రను విడగొట్టిన పాపంలో ఈయనా పరోక్ష భాగస్వామే. ఉమ్మడి ఏపీని విడగొట్టిన యూపీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసి విభజన పాపి అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి ప్రధాని మన్మోహన్ నోటి మాటగా చెప్పినది చట్టంలో పొందుపరిచేలా చేయడంలో విఫలమయ్యారు. అలా చేసి ఉంటే ఈ రోజు ఏపీకి ఇన్ని కష్టాలు ఉండేవి కావు. చేసిందంతా చేసి ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా పోరాటానికి రెడీ అవుతున్నారు.
ఇక పదవీకాలం కొంత మిగిలి ఉన్న మిగతా పెద్దలు కూడా వీరికంటే తక్కువ వారేమీ కాదు. యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాష్ట్రం కోసం పిసరంత కూడా పనిచేయలేదు. టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అయితే అప్పట్లో విభజనకు వ్యతిరేకంగా చొక్కా చించుకున్నా ఇప్పడు తన వ్యాపారాలు, మరోసారి రాజ్యసభ సీటు సాధించడంపైనే పూర్తిగా దృష్టి పెట్టారు. కాంగ్రెస్ కు చెందిన సుబ్బిరామిరెడ్డి వ్యక్తిగత ఇమేజి - వ్యాపారాలు పెంచుకోవడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలన్న ఊసే లేని వ్యక్తి. కాంగ్రెస్ కే చెందిన కేవీపీ రామచంద్రరావు విభజన సమయంలో కొంత పోరాడినా అధిష్ఠానాన్ని ధిక్కరించలేకపోయారు. ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ - తన కోసం రాజకీయంగా వాడుకునేందుకు పావులు కదపడం మినహా ఏమీ చేయడం లేదు. ఇలా పెద్దరికం నిలుపుకోని నేతలంతా మరోసారి పెద్దోళ్లు కావడానికి మాత్రం తయారవుతున్నారు.