Begin typing your search above and press return to search.
ఏపీ ఏటీఎంల్లో ఫుల్ క్యాష్.. నిజమేనా?
By: Tupaki Desk | 19 Dec 2016 7:43 AM GMT ఏపీలో నగదు కష్టాలు తీరబోతున్నాయి. పెద్ద మొత్తంలో క్యాష్ రాష్ట్రానికి చేరడంతో బ్యాంకులు - ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. ఆర్బీఐ నుంచి శనివారమే 25 వేల కోట్ల రూపాయల మొత్తం రాష్ట్రానికి చేరింది. అదంతా సోమవారం ఉదయం నాటికే ఏటీఎంలు - బ్యాంకులకు చేరింది. దీంతో ఈ రోజు అన్ని ఏటీఎంలు దాదాపుగా పనిచేస్తున్నాయి. పెద్ద మొత్తంలో క్యాష్ రావడంతో చాలావరకు కష్టాలు తీరినట్లే అని చెప్పొచ్చు.
- ఆర్బీఐ నుంచి వచ్చిన డబ్బు: 25 వేల కోట్లు
- సాధారణ ఖాతాల నుంచి గరిష్ఠంగా వారంలో 24 వేలు తీసుకోవచ్చు.. ఆ లెక్కన చూస్తే ఈ మొత్తం 1.04 కోట్ల మంది విత్ డ్రా చేసుకోవడానికి సరిపోతుంది.
- కరెంటు ఖాతాలవారైతే 50 వేలు విత్ డ్రా చేయొచ్చు.. ఆ లెక్కన 50 లక్షల మంది కరెంటు ఖాతాదారులకు సరిపోతుంది.
- ఏటీఎంల నుంచి అయితే రోజుకు 2,500 తీసుకోవచ్చు. అంటే 10 కోట్ల మందికి ఇది సరిపోతుందన్నమాట. కానీ... ఏపీ జనాభా దాదాపు అందులో సగం కూడా లేదు. అందులోనూ ఏటీఎం కార్డులు అంత సంఖ్యలో ఉండవు. 2 కోట్ల ఏటీఎం కార్డులు ఉంటాయనుకున్నా కూడా అయిదు రోజుల్లో ఒక్కో కార్డుకు 10 వేలు తీసుకోవచ్చు.
- ఇక పెళ్లి చేసుకునే జంటలైతే 2.5 లక్షలు తీసుకోవచ్చు. అంటే 10 లక్షల జంటలకు సరిపడా మొత్తం ఇది..
... అందరూ ఒకే విధానంలో తీసుకోరు కాబట్టి యావరేజిగా తీసుకున్నా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సగటున అయిదు వేలు దొరుకుతుంది.
అయితే.. ఈ లెక్కలన్నీ డబ్బులు పక్కదారి పట్టకపోతేనే. బ్యాంకులు - నేతలు కుమ్మక్కైతే ఎవరో కొందరు బడాబాబులకే డబ్బు చేరి మళ్లీ ఎప్పటిలా సామాన్యులు ఏటీఎంలు ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎదురుచూడాల్సిందే. పనిచేయగానే లైన్లో నిలబడాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/