Begin typing your search above and press return to search.

ఏపీ సెక్రటేరియట్ కొత్త విషయాలు...

By:  Tupaki Desk   |   27 July 2016 8:12 AM GMT
ఏపీ సెక్రటేరియట్ కొత్త విషయాలు...
X
పరిపాలనమొత్తం సొంత రాష్ట్రం నుంచే జరపాలని నిర్ణయించినప్పటి నుంచీ అధికారుల తరలింపు విషయం నత్తనడకన సాగుతుందనే అపవాదును మూటగట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ విషయంలో సచివాలయం పనులు - ఉద్యోగుల తరలింపు విషయాలు వాయిదాల మీద వాయిదాలేసుకుని నానుతున్నాయి. అయితే నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవన పనులు ఇప్పుడు ఊపందుకున్నట్లు తెలుస్తుంది. నిన్నమొన్నటి వరకూ మొండి గోడలతో - సగం సగం పూర్తయిన పనులతో కనిపించిన సెక్రటేరియట్‌ ఇప్పుడు నయా లుక్ తో కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి ఛాంబర్‌ - పేషీ - చీఫ్‌ సెక్రటరీ పేషీలు కూడా దాదాపుగా పూర్తవడం - ఇంటీరియల్ డెకరేషన్ పనులుకూడా దాదాపుగా ఒక కొలిక్కి రావడంతో దగదగ మెరుపులతో కార్పొరేట్ కార్యాలయ భవనాన్ని తలపించేలా సెక్రటేరియట్ మారుతోంది. ఫ్లోరింగ్ పనులు దాదాపు పూర్తికావడంతో పాటు మంత్రుల ఛాంబర్లు కూడా సర్వాంగ సుందరంగా మారుతున్నాయి.

సెక్రటేరియట్‌ చుట్టుపక్కల మొక్కల కోసం సెక్రటేరియట్‌కు వెళ్లే ప్రధాన ద్వారం వద్ద సివరేజ్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌ ను నిర్మిస్తున్నారు. అక్కడకు చేరే మురికి నీటిని శుద్ధి చేసి - ఆ నీటిని వినియోగిస్తారు. ఇదేవేగంతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ పనులు కూడా వేగంఆ సాగుతున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఇంకా టాయిలెట్ల నిర్మాణాలు - తాగునీటి సదుపాయాలు పూర్తికాలేదు. వీటికి సంబందించిన పనులు కూడా త్వరితగతిన పూర్తయితే ఆగస్ట్ నెలాఖరుకల్లా ఏపీ ఉద్యోగులకు కొత్త సెక్రటేరియట్ అందుబాటులోకి రానుందనడంలో సందేహం లేదని చెప్పాలి.