Begin typing your search above and press return to search.
టీడీపీ ఆంధ్రుల సెంటిమెంట్ హిట్ అవుతుందా?!
By: Tupaki Desk | 11 Jun 2015 6:35 AM GMT'ఓటుకు నోటు వ్యవహారం' ఇంకా ఎంత వరకూ వెళుతుందో కానీ.. ఈ వ్యవహరాన్ని ఆంధ్రులందరికీ ఆపాదించే వ్యూహంతో ఉన్నట్టుంది తెలుగుదేశం పార్టీ. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లినా.. దాన్ని ఆంధ్రుల సెంటిమెంట్‌ను జోడించాలని టీడీపీ భావిస్తున్నట్టుగా ఉంది. ఈ మేరకు తెలుగుదేశం నేతలు ఇప్పటికే ఈ అస్త్రాన్ని సంధించడానికి రంగం సిద్ధం చేసుకొన్నారు. అందుకు తగ్గట్టైన ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పటికే 'ఐదు కోట్ల ఆంధ్రులకు అవమానం' అనే నినాదాన్ని ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎంతో వ్యవహరిస్తున్న తీరు ద్వారా ఐదు కోట్లమంది ఆంధ్రులను అవమానిస్తోదంటూ తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ అవమానిస్తున్నది కేవలం చంద్రబాబును కాదని.. ఐదు కోట్ల మంది ఆంధ్రులనని వారు వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రుల పట్ల వివక్షతో వ్యవహరిస్తోందన్నట్టుగా తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్నారు. అయితే చంద్రబాబు ఏపీకి సీఎంనే అయినా.. తెలుగుదేశం నినాదం ఏ మేరకు హిట్ అవుతుంది? అనేది సందేహమే!
తెలుగుదేశం పార్టీ తీరును గమనించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి వారు కూడా హైదరాబాద్‌లో శాంతిభద్రతల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ ఏర్పాటై సంవత్సరం గడిచింది ఎక్కడైనా ఒక్క ఆంధ్రుడిపై దాడి జరిగిందా? అలాంటి వ్యవహారం ఏదైనా వార్తల్లోకి వచ్చిందా? అంటూ టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు వాదిస్తున్నారు. ఇది ఆంధ్రులకు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన వివాదం కాదని వారు వివరణ ఇచ్చుకొంటున్నారు. తెలంగాణ సీఎం కూడా ఇదే మాట మాట్లాడాడు.
ఇక ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి కూడా టీఆర్‌ఎస్ వాళ్లలాగానే మాట్లాడుతున్నాడు. దీన్ని ఉభయ రాష్ట్రాల ప్రజలమధ్య వివాదం కాదని ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు. అయితే తెలుగుదేశం మాత్రం 'ఐదు కోట్లమంది ఆంధ్రులకు అవమానం' అంటోంది. మరి ఈ నినాదం హిట్ అవుతుందా?!