Begin typing your search above and press return to search.

రైలుకు-ప్లాట్ ఫామ్ కు మధ్య చిక్కుకొన్న విద్యార్థిని విషాదాంతం

By:  Tupaki Desk   |   8 Dec 2022 12:55 PM GMT
రైలుకు-ప్లాట్ ఫామ్ కు మధ్య చిక్కుకొన్న విద్యార్థిని విషాదాంతం
X
విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్ లో గాయపడిన విద్యార్థిని శశికళ ఆ షాక్ తోనే కన్నుమూసింది. దువ్వాడ రైల్వేస్టేషన్ లో రైలు, ఫ్లాట్ ఫాం మధ్య ఇరుక్కున్న శశికళను గంటన్నరపాటు శ్రమంచి మరీ రెస్క్యూటీం సురక్షితంగా బయటకు తీసింది. అయితే ఈ క్రమంలో రైలు ఒత్తిడి.. ఇటు ఫ్లాట్ ఫామ్ రాపిడి వల్ల ఆమె షాక్ కు గురైంది.

ఆ షాక్ లోనే కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతూ అసువులు బాసింది. అంతర్గత గాయాల వల్ల ఆమె మరణించిందిన ఆస్పత్రివర్గాలు తెలిపాయి.

నిండా 20 ఏళ్లు కూడా లేని విద్యార్థిని శశికళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ షాక్ లోనే కోమాలోకి వెళ్లిపోయింది. యూరిన్ బ్లాడర్ దెబ్బతిని రక్తస్రావం కావడంతో ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ కాపాడలేకపోయారు. అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు విడిచింది.

అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం కాలేజీకి వెళ్లేందుకు గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్ లో ఆమె దువ్వాడకు చేరుకుంది.

స్టేషన్ లో రైలు దిగుతున్న సమయంలో జారిపడి రైలు-ఫ్లాట్ ఫామ్ మధ్యలో శశికళ ఇరుక్కుపోయింది. ఆమె కాలు పట్టాల మధ్య ఉండిపోవడంతో తీవ్రగాయాలతో గగ్గోలు పెట్టింది.

రైల్వే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని ఫ్లాట్ ఫామ్ ను కట్ చేశారు. గంటన్నరపాటు శ్రమించి ఆమెను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. యూరన్ బ్లాడర్ దెబ్బతిని రక్తస్రావం కావడంతో ఇతర అవయవాలు కూడా దెబ్బతిని శశికళ మృతిచెందింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.