Begin typing your search above and press return to search.
విభజన చిచ్చు: ఏపీ స్టూడెంట్ పాస్ లకు నో
By: Tupaki Desk | 25 Jun 2015 9:12 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరిగిన విభజన ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే సామాన్యుల మీద పడుతోంది. తాజాగా ఖమ్మం.. కృష్ణా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో తలెత్తిన ఒక వివాదం ఇబ్బందికరంగా మారింది.
ఖమ్మం.. కృష్ణా జిల్లాలకు చెందిన సరిహద్దు గ్రామాల మధ్య నిత్యం భారీగా రాకపోకలు సాగుతుంటాయి. రాష్ట్ర విభజన జరిగినా ఆర్టీసీ విభజన జరగకపోవటంతో ఇంతకాలం ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ.. తాజాగా కృష్ణా జిల్లా నందిగామ రామిరెడ్డిపల్లెకు చెందిన విద్యార్థులు ఖమ్మం జిల్లా (తెలంగాణ రాష్ట్రం) కు చెందిన బస్సులో ఎక్కారు.వారి పాస్ లు చూపించారు. దానికి చెల్లవని సదరు ఆర్టీసీ కండెక్టర్ చెప్పటంతో వివాదం నెలకొంది.
ఆర్టీసీ రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన బస్సుల్లో ఆంధ్రా విద్యార్థుల పాస్‌లను ఎక్కించేది లేదని తేల్చేయటంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏపీ నుంచి తెలంగాణ వైపు వెళ్లే బస్సుల్లో విద్యార్థుల్ని ఎక్కించుకున్నప్పుడు.. తెలంగాణ నుంచి ఏపీ వైపు వెళ్లే బస్సుల్లోనూ ఎక్కించుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు.
విద్యార్థులతోపాటు.. వారి తల్లిదండ్రులు ఆందోళనకు కూర్చోవటంతో ఇదో ఇష్యూగా మారింది. నిజానికి ఇలాంటి సున్నిత అంశాల పట్ల సరిహద్దు ప్రాంతాలకు చెందిన అధికారులు సామరస్యపూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటే వివాదం ఇట్టే సమిసిపోతుంది. కాకపోతే.. రెండు రాష్ట్రాల అధికారపక్షం మధ్య సంబంధాలు బాగుంటే ఇలాంటివి తొందరగా సమిసిపోతాయి. కానీ.. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు సరిగా లేని నేపథ్యంలో.. ఇలాంటి ఇబ్బందులు మున్ముందు చాలానే ఎదురవుతాయన్న మాట వినిపిస్తోంది.