Begin typing your search above and press return to search.
తెలంగాణలో ఇంజినీరింగు చదువుతామంటున్న ఆంధ్ర స్టూడెంట్సు
By: Tupaki Desk | 15 April 2016 5:30 PM GMTతెలంగాణలోని ఇంజినీరింగ్ - మెడిసిన్ కాలేజీల వైపు ఏపి విద్యార్థులు ఆసక్తి చూపు తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నాణ్యమైన కాలేజీలు లేకపోవడం, మెరుగైన కళాశాలలన్నీ హైదరా బాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉండటంతో విద్యార్ధులు ఎక్కువగా తెలంగాణ ఎంసెట్ వైపు చూస్తున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ప్లేస్ మెంట్ - ఫ్యాకల్టీ - ఇతర వసతుల విషయంలో రాజీ పడలేకపోతున్నట్లు తెలుస్తోంది. 15 శాతం ఓపెన్ కోటా సీట్ల కోసం భారీ సంఖ్యలో పోటీకి సిద్దమవుతున్నారు. గురువారం రాత్రి వరకు తెలంగాణ రాష్ట్ర ఎంసె ట్-2016కు 2,46,297 మంది దరఖాస్తు చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 50,854 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన నాలుగు ప్రాంతీయ కేంద్రాలు విజయవాడ - విశాఖపట్నం - తిరుపతి - కర్నూలు నుంచే 44,805 దరఖాస్తులు అందటం విశేషం. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం దరఖా స్తులు అధిక మయ్యాయి. గత ఏడాది టిఎస్ ఎంసెట్- 2015కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీరింగ్, మెడిసన్ విభాగాలకు కలిసి దాదాపు 30 వేల దరఖాస్తులు రాగా, ఈ ఏడాది ఏకంగా 50,854 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు.
ఆలస్య ఫీజుతో దరఖాస్తుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉండటంతో మరి కొంత మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రం నుంచి దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లలో ఎక్కువగా మెడికల్ విభాగానికే దరఖాస్తులు అందాయి. ఇప్పటి వరకు లక్షకు పైగా దరఖాస్తులు దాటగా, వాటిలో ఎయూ, ఎస్వీయు నుంచి 30,487 దరఖాస్తులు వచ్చాయి. ఇంజినీరింగ్ కోసం ఈ రెండు వర్సిటీల నుంచి 20,367 మంది విద్యార్ధులు దరఖాస్తులు చేసుకోవడం విశేషం.
విభజన తరువాత కుదురుకోని ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థలు సరైన ప్రమాణాలతోనడవడం లేదు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం... యాజమాన్యాలు కూడా ఏదో రకంగా నడిపిస్తుండడంతో విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. దీంతో హైదరాబాద్ లో చదవడమే బెటరని ఏపీ విద్యార్థులు, తల్లిదండ్రులు భావిస్తున్నారు.