Begin typing your search above and press return to search.

చికెన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు నోటీసులు

By:  Tupaki Desk   |   21 Nov 2018 12:18 PM GMT
చికెన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు నోటీసులు
X
అక్రమంగా.. నిబంధనలకు విరుద్ధంగా కోళ్లను చంపి వ్యర్థాలను ఇష్టానుసారంగా పడవేయడంపై పౌల్ట్రీ వ్యాపారులతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పౌల్ట్రీల్లో ముఖ్యంగా మగకోళ్లను వ్యాపార కోణంలో పెద్ద ఎత్తున వధిస్తున్నారని.. ఇందుకోసం వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నారని.. పౌల్టీ పరిశ్రమను ఈ పనులను ఆపాలని కోరుతూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పెటా) హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు -కొందరు బడా పౌల్ట్రీ వ్యాపారులకు నోటీసులను అందజేసింది.

పౌల్ట్రీల్లో మాంసం కోసం పెంచే కోళ్లు బలిష్టంగా మాంసం కలిగి ఉంటాయని.. గుడ్ల ఉత్పత్తి కోసం అంత బలంగా ఉండకుండా వీటి మాంసం తినడానికి పనికిరాకుండా ఉంటాయని పెటా ప్రతినిధులు తెలిపారు. కానీ పౌల్ట్రీ ప్రతినిధులు మాత్రం ఆడకోళ్లను గుడ్ల కోసం పెంచుతూ వాటి మాంసాన్ని వ్యాపారం కోసం అమ్ముకుంటున్నారని.. మగ కోళ్లను పెంచడం లేదని పెటా ఆరోపిస్తోంది.

జంతు సంరక్షణ ప్రతినిధులు కూడా ఇలా గుడ్ల కోసం ఉపయోగించే కోళ్లను మాంసానికి వినియోగిస్తున్నారని పిటీషన్ దాఖలు చేసింది. చాలా పౌల్ట్రీ ఫారాలల్లో మిలియన్ల కొద్దీ మగ కోళ్లను చంపేసి వాటి వ్యర్థాలను ఇష్టానుసారంగా పొలాలు, నిర్జన ప్రదేశాల్లో వదిలేస్తున్నారని.. దీని వల్ల వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. పౌల్ట్రీ ఫారాల యజమానులు ఈ విషయంలో కనీస జాగ్రత్తలు పాటించడం లేదని పేర్కొన్నారు.

చికెన్ తినే వినియోగదారులందరికీ వాటి తయారీ - ఏ ఏ చికెన్ ను సరఫరా చేస్తున్నారనే విషయాలను తెలుసుకునే హక్కు ఉందని పెటా హైకోర్టులో కోరింది. అవి మాంసం కోసం వినియోగించే మగ కోళ్లా.? ఆడకోళ్లో తెలిసేలా చికెన్ వ్యాపారులను ఆదేశించాలని.. వినియోగదారులకు అవగాహన కల్పించాలని పెటా ఇండియా అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ పాలసీ నింకుజ్ శర్మ కోరారు.