Begin typing your search above and press return to search.
కేంద్రంపై ఏపీ, తెలంగాణ అటాక్
By: Tupaki Desk | 15 March 2016 8:15 AM GMTకేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ - తెలంగాణ నేతలు నిలదీస్తున్నారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలు - తెలంగాణకు చెందిన టీఆరెస్ నేతలు కేంద్రంపై దాడి ప్రారంభించారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి - హోదా ప్రకటించాలని కోరుతూ లోక్ సభ - రాజ్యసభల్లో కాంగ్రెస్ సభ్యులు గట్టిగా తమ స్వరం వినిపించారు. లోక్ సభ - రాజ్యసభల్లో ఏపీ కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ జాతీయస్థాయి పెద్దలే రంగంలోకి దిగారు. గులాంనబీ అజాద్ - దిగ్విజయ్ సింగ్ వంటివారంతా ఏపీ కోసం గట్టిగా మాట్లాడారు.
మరోవైపు లోక్ సభలో టీఆరెస్ సభ్యులు కూడా మోడీ సర్కారును నిలదీశారు. ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా మోసం చేస్తున్నారని టీఆరెస్ ఎంపీ జితేందర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీకి అన్నీ కేటాయిస్తున్నా తెలంగాణకు ఏమీ కేటాయించడం లేదన్న ఆయన ఏపీకి ఇవ్వడంతో పాటు తెలంగాణకు కూడా ఇవ్వాలని సమన్యాయం పాటించాలని అన్నారు. ఆయనకు మద్దతుగా నిజామాబాద్ ఎంపీ కవిత - ఇతర సభ్యులు కేంద్రం వైఖరి పట్ల నిరసన తెలిపారు.
మొత్తానికి ఈ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అంశాలు ఎన్డీయే ప్రభుత్వానికి ముప్పతిప్పలు పెడుతున్నాయి. యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తే ఆ పాపం ఎన్డీయే సర్కారు మెడకు చుట్టుకున్నట్లయింది.