Begin typing your search above and press return to search.

నాలుగునెలల్లో ఏపీతాత్కాలిక సెక్రటేరియట్ రెఢీ?

By:  Tupaki Desk   |   29 Jan 2016 4:15 AM GMT
నాలుగునెలల్లో ఏపీతాత్కాలిక సెక్రటేరియట్ రెఢీ?
X
ఏపీ తాత్కాలిక సెక్రటేరియట్ వాయువేగంతో సిద్ధం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. జూన్ మొదటి వారంలో హైదరాబాద్ లోని సచివాలయ ఉద్యోగుల్ని ఏపీ రాజధానికి తరలించాలన్న లక్ష్యంతో ఉన్న ఏపీ సర్కారు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ సచివాలయ ఉద్యోగులు ఏపీ రాజధానికి వస్తే వారికి ఆఫీస్ వసతి లేదు. ఈ నేపథ్యంలో వారికి అలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఉండేందుకు వీలుగా తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం ఆరు బ్లాకులుగా.. జీ ప్లస్ 7 విధానంలో డిజైన్ చేస్తున్న ఈ భవనాన్ని మే రెండో వారానికి 6 లక్షల చదరపు అడుగుల స్థలం వినియోగించేందుకు వీలుగా సిద్ధం చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది.

మే రెండో వారానికి సిద్ధమయ్యే భవనంలో కనీసం 6750 మంది వరకూ కూర్చొని పని చేసుకునే విధంగా తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. తాత్కాలిక సచివాలయంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం.. అసెంబ్లీ.. శాసన మండలి.. కలెక్టర్ల సదస్సులు లాంటివి నిర్వహించుకునేలా రూపొందించనున్నారు. జూన్ నాటికి హైదరాబాద్ లో పని చేస్తున్న ఏపీ సచివాలయ ఉద్యోగుల్ని ఏపీకి తీసుకువచ్చే విషయంలో ఏపీ సర్కారు ఎంత పట్టుదలగా ఉందోనన్న విషయం వాయువేగంతో చేస్తున్న ఏర్పాట్లు చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.