Begin typing your search above and press return to search.

ఏపీ అంతటా జీరో ఎఫ్ ఐఆర్..సీఎం మరో కీలక నిర్ణయం!

By:  Tupaki Desk   |   9 Dec 2019 2:09 PM GMT
ఏపీ అంతటా జీరో ఎఫ్ ఐఆర్..సీఎం మరో కీలక నిర్ణయం!
X
వెటర్నరి డాక్టర్ దిశ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో నింధితులను కఠినంగా శిక్షించాలంటూ దేశమంతటా పెద్ద ఎత్తున నిరసనలు వెలువడ్డాయి. ఆ తరువాత పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేయడంతో పోలీసులపై ప్రశంసలు కురిపించారు. అలాగే ఇదే సమయంలో వేళ జీరో ఎఫ్ ఐఆర్ పై దేశవ్యాప్తంగా ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఈ పోలీస్ స్టేషన్ - ఆ పోలీస్ స్టేషన్ అన్న తేడా లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేసే విధంగా జీరో ఎఫ్ ఐఆర్ ను అందుబాటులోకి తీసుకురావాలని చర్చ జరుగుతుంది.

ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ జీరో ఎఫ్ ఐ ఆర్ అమలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ అధికారులకు జీరో ఎఫ్ ఐ ఆర్ పై దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ, ముంబై రాష్ట్రాల మాదిరిగానే ఏపీలో కూడా జీరో ఎఫ్ ఐ ఆర్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఇకపై ఏదైనా ఫిర్యాదు చేయాల్సి వస్తే ..ఆ పరిధిలోని పోలీస్ స్టేషన్ కె వెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కూడా ఫిర్యాదు చేయవచ్చు. జీరో ఎఫ్‌ ఐ ఆర్‌ పై నేడు అసెంబ్లీ లో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి ఎం.సుచరిత మాట్లాడారు. ఏపీలో అన్ని పోలీస్ స్టేషన్స్ లో జీరో ఎఫ్‌ ఐ ఆర్‌ తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

అసలు జీరో ఎఫ్ ఐ ఆర్ అంటే ఏమిటి అంటే ఎవరైనా ఎప్పుడైనా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయిన ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడమే జీరో ఎఫ్ ఐ ఆర్ . ఘటనా ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది అనే దానితో నిమిత్తం లేకుండా ఎక్కడైనా కేసు నమోదు చేయడానికి ఉండే వెసులుబాటు జీరో ఎఫ్ ఐ ఆర్ . నేరం జరిగిన ప్రదేశం యొక్క పరిధి తో సంబంధం లేకుండా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయవచ్చు. అలా నమోదయ్యే ఎఫ్ ఐఆర్ నంబర్ ను జీరో గా పరిగణిస్తారు.


- Dinakar