Begin typing your search above and press return to search.

ఏపీకి ఇంత ద్రోహ‌మా.. బీజేపీపై మ‌రో దుమారం

By:  Tupaki Desk   |   2 Nov 2022 9:00 AM GMT
ఏపీకి ఇంత ద్రోహ‌మా.. బీజేపీపై మ‌రో దుమారం
X
ఔను! ఇప్పుడు వెలుగు చూసిన వార్త‌లే క‌నుక నిజ‌మ‌ని తేలితే ఏపీ ప్ర‌జ‌లు బీజేపీని అస్సలు క్ష‌మించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు పరిశీల‌కులు. పైగా బీజేపీ గ్రాఫ్ మ‌రింత ప‌డిపోయినా ఆశ్చ‌ర్యం లేద‌ని చెబుతున్నారు. ఇక‌, బీజేపీ నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేర‌ని అంటున్నా రు. మ‌రి ఏం జ‌రిగింది? ఎందుకు ఈ చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది? అనేది ఆస‌క్తిగా మారింది. రాష్ట్ర విభ‌జ‌న చట్టంలోనే విశాఖ‌కు రైల్వే జోన్ ఇస్తార‌ని, ఇవ్వాల‌ని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ ప్ర‌భుత్వం పోయి మోడీ కొలువుదీరిన త‌ర్వాత ఏపీ విష‌యాలు, విభ‌జ‌న అంశాల‌ను ఆయ‌న ప‌క్క‌న పెట్టేశారు.

ఇక‌, అప్ప‌టి నుంచి కూడా విశాఖ రైల్వే జోన్ విష‌యం ప్ర‌స్తావ‌న‌కు రావ‌డం లేదు. ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ కేంద్ర మంత్రి అమిత్ షాను కోర‌డంతో మ‌ళ్లీ ఈ ప్ర‌తిపాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. దీంతోతాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ నెల 11న విశాఖ‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో విశాఖ రైల్వే జోన్‌కు కూడా ఆయ‌న శ్రీకారం చుడ‌తార‌ని రాజ‌కీయంగా వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై అటు కేంద్రం కానీ, ఇటు ఏపీ ప్ర‌భుత్వం కానీ ఎలాంటి ప్ర‌క‌టనా చేయ‌లేదు. అయిన ప్ప‌టికీ.. ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. బ‌హుశ ప్ర‌ధాని షెడ్యూల్‌లో ఇది ఉండే ఉంటుంద‌ని మేధావులు సైతం చెబుతున్నారు.

ఇదిలావుంటే, తాజాగా బీజేపీ ఏపీ వ‌ర్గాలు ఒక స‌మావేశం నిర్ణ‌యించాయి. ఈ స‌మావేశంలో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌లోతాము ఏం చేయాల‌నే అంశంపై చ‌ర్చించాయి. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ విశాఖ రైల్వే జోన్‌కు శంకు స్థాప‌న చేస్తార‌నే విష‌యంపైనా చ‌ర్చించారు.

అయితే, దీనిని స్వాగ‌తించాల్సిన బీజేపీ నాయ‌కులు అస‌లు ఈ కార్య‌క్ర‌మాన్ని నిలిపివేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల‌ని నిర్ణ‌యించార‌ని, దీనిపై కేంద్ర బీజేపీకి లేఖ రాయాల‌ని కూడా నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇవే ఇప్పుడు ఆశ్చ‌ర్యంగాను విస్మ‌యంగాను ఉన్నాయి. ఎందుకంటే జ‌ర‌గ్గ జ‌ర‌గ్గ ఒక మంచి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంటే ఇలా ఎందుకు అడ్డుప‌డుతున్నారు? ఏపీ అభివృద్ధి వారికి ఇష్టం లేదా? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

అయితే,బీజేపీ నాయ‌కులు చెబుతున్న‌దేంటంటే.. త‌మ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు కేంద్రాన్ని నిల‌దీయ‌డంతో ఈ ప్రాజెక్టుకు క‌ద‌లిక వ‌చ్చింద‌ని, ఇది రాజ‌కీయంగా త‌మ‌కు మాత్ర‌మే ల‌బ్ధి చేకూరాల‌ని, వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో ఎలాగూ త‌మ ప్ర‌భుత్వం ఏపీలో అధికారంలోకి వ‌స్తుంద‌ని(?) సో, అప్పుడు ఈ కార్య‌క్ర‌మం చేయించాల‌ని భావిస్తున్న‌ట్టు తేల్చి చెప్పారు. అంతేకాదు, ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మాన్ని త‌మ‌కు అనుకూలంగా వైసీపీ మ‌లుచుకుని, రాజ‌కీయంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌ని చూస్తోంద‌ని అందుకే తాము ఒప్పుకోవ‌డం లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

అయితే, ఇది స‌రికాద‌ని మేధావులు అంటున్నారు. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయంగా చూడ‌డం, ఓటు బ్యాంకుగా మార్చుకోవ‌డం చేస్తే ఏపీ ఇలానే ఉండిపోతుంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి బీజేపీ నేత‌లు ఇలానే ముందుకు వెళ్తారో.. ఏపీ అభివృద్ధి కోరుకుంటారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.