Begin typing your search above and press return to search.

క‌మ‌ల నాథులు కునుకుతున్నారు.. చ‌ప్పుడు చేయొద్దు..!

By:  Tupaki Desk   |   20 Nov 2022 2:30 AM GMT
క‌మ‌ల నాథులు కునుకుతున్నారు.. చ‌ప్పుడు చేయొద్దు..!
X
అవ‌కాశం వ‌స్తే చాలు.. కుమ్మేసేందుకు నాయ‌కులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీలు, నాయ‌కులు ఎప్పుడూ కూడా త‌మ‌కు అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స్ప‌ష్టంగా వాడుకునే ప్ర‌య త్నం చేస్తారు. ఇటీవ‌ల ప్ర‌ధాన మంత్రి మోడీ విశాఖ‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా ఏపీ బీజేపీ నాయ‌కుల‌కు ఇదే హిత బోధ చేశారు. పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లాల‌ని, వైసీపీ స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌ని సూచించారు.

అయితే, ఇది జ‌రిగిన ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కాకుండానే.. ఏపీ క‌మ‌ల‌నాథులు మాత్రం కునుకుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ప‌ది రోజుల్లో రెండు విష‌యాలు స్ప‌ష్టంగా.. క‌నిపిస్తున్నాయి.

ఒక‌టి.. చ‌ర్చిల‌కు ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌డం, 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 175 కోట్ల చొప్పున ప‌నులు ప్రారం భించాల‌ని నిర్ణ‌యించ‌డం. రెండు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హారం. ఆయ‌న బీజేపీతో పొత్తులోనే ఉన్నా.. ఒంట‌రి పోరుకు రెడీ అవుతున్నారు.

ఈ రెండు విష‌యాల‌పై స్పందించ‌డం అత్యంత అవ‌స‌రమే అయిన‌ప్ప‌టికీ బీజేపీ నాయ‌కులు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. త‌మ‌కు ఏమీ తెలియ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వాస్త‌వానికి నియోజ‌క‌వ‌ర్గాల‌కి 175 కోట్లు ఇచ్చి చ‌ర్చిల‌ను నిర్మించ‌డం అంటే.. అది క్రిస్టియానిటీని పెంచ‌డ‌మే క‌దా..! అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఎందుకంటే దేశంలో ఏ ప్ర‌భుత్వ‌మైనా మ‌తాల‌ను ప్రోత్స‌హించ‌రాద‌నేది రాజ్యాంగం చెబుతున్న మాట‌.

మ‌రి ఇక్క‌డ ఇంత జ‌రుగుతున్నా.. బీజేపీ నాయ‌కులు ఏం చేస్తున్నారు? అనేది ప్ర‌శ్న‌, పోనీ.. హిందూ ఆల‌యాల‌ను అబివృద్ధి చేస్తున్నారా? అంటే లేదు. అంతేకాదు, ఆయా ఆల‌యాల‌కు చెందిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి.

అంతేకాదు, ఆల‌య ఆదాయాల‌కు కూడా లెక్క తేల‌డం లేదు. మ‌రి ఇన్ని విష‌యాలు పెట్టుకుని కూడా బీజేపీ నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామా ల‌తో అస‌లు ఏపీలో బీజేపీ ఉందా ? లేదా ? అనే ప్ర‌శ్న తెర‌మీద‌కు వ‌చ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.