Begin typing your search above and press return to search.
ఇక, ఏపీ బీజేపీ ఇంతే.. ఎందుకంటే..!
By: Tupaki Desk | 20 Jan 2023 2:30 AM GMTఇక, ఏపీ బీజేపీ ఇంతే!! ఇదీ.. ఇప్పుడు ఆ పార్టీ నేతలే కాదు.. రజకీయ నాయకులు కూడా చెబుతున్న మా ట. దీనికి కారణం.. ఇటీవల డిల్లీలో జరిగిన రెండు బీజేపీ విస్తృత స్థాయి సమావేశాల్లో ఏపీ గురించి.. ఇక్కడి బీజేపీ రాజకీయాల గురించి ఢిల్లీ బీజేపీ పెద్దలు చర్చించారు. ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకున్నా రు. పార్టీ పరిస్థితిని అంచనా వేసుకున్నారు. అదేసమయంలో తెలంగాణ రాజకీయాల గురించి కూడా మాట్లాడారు.
అక్కడ పార్టీ ఎలా ముందుకు సాగుతోంది? ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది? వంటివివరాలను కూడా తెలుసుకున్నారు. అయితే.. రెండూ తెలుగు రాష్ట్రాలే అయినప్పటికీ.. రెండు చోట్లా విపక్షంలోనే ఉన్నప్పటికీ.. రెండు రాష్ట్రాల విషయంలోనూ బీజేపీ వ్యూహాత్మక వైఖరిని తీసుకోవడం.. ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెలంగాణ విషయానికి వస్తే.. పోరును ఉద్రుతం చేయాలని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని.. బీజేపీ పెద్దలు సూచించారు.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. సోము వీర్రాజు నేతృత్వంలో ఏపీలో జరుగుతున్న బీజేపీ కార్యక్రమాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఇది చాలు.. ఇలానే ముందుకు సాగండి! అని హితోపదేశం చేశారట. వాస్తవానికి తెలంగాణలో కంటే కూడా ఏపీలో బీజేపీకి ఎదిగేందుకు, వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు చాలానేఎడ్జ్ ఉంది. చిన్న చిన్న హామీలతో ఇక్కడ పాగా కూడా వేసే అవకాశం ఉంది.
2014లో నాలుగు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో విజయం దక్కించుకున్న బీజేపీ.. గత ఎన్నికల్లో మాత్రం చతికిల పడింది. అయితే.. పార్టీకి సంబంధించి ఎలా ముందుకు సాగాలనే విషయంపై ఎలాంటి పోస్టు మార్టం చేయకుండా.. ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాలు చాలు అని అధిష్టానం చెప్పడం గమనార్హం. పోనీ.. ఇప్పుడేమన్నా.. వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు పాశుపతాస్త్రాలు సంధిస్తున్నారా? అంటే.. అదేమీ లేదు.
ఏదో మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఇదే చాలని.. బీజేపీ చెప్పడం గమనిస్తే.. ఇక, ఏపీలో బీజేపీ ఇంతే! అని వారు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
మరి ఇదే పంథాలో ముందుకు సాగితే.. బీజేపీ సాధించేది ఏమైనా ఉంటుందా? అంటే.. అదేమీ కనిపించడం లేదు. అయినా.. బాగుందని అనడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.