Begin typing your search above and press return to search.

స్పందించు జ‌గ‌న్ ప‌రువు పోయేలా ఉంది !

By:  Tupaki Desk   |   13 Aug 2022 9:30 AM GMT
స్పందించు జ‌గ‌న్ ప‌రువు పోయేలా ఉంది !
X
జిల్లాల పున‌ర్విభ‌జ‌న త‌రువాత రాష్ట్రం ద‌శ తిరిగిపోతుంద‌న్న మాట‌లేవో వినిపించాయి. జిల్లాల పున‌ర్విభ‌జ‌న త‌రువాత పాల‌న మ‌రింత చేరువ కావ‌డం సాధ్య‌మ‌ని ఓ ప్ర‌చారం అధికారం ద‌క్కించుకున్న వారి నుంచి వినిపించింది. ఆ మాట‌లూ ఈ మాట‌లూ విన్నాక అంతా బాగుంటుంది అని ఓ ఊహ అంద‌రిలోనే క‌దిలింది. కానీ ఆ ఊహ మేర‌కు వాస్త‌వం లేదు. వాస్త‌వం అన్న‌ది అప్ప‌టి మాట‌ల‌కు విరుద్ధంగా ఉంది. అందుకే ఇప్పుడు జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన స‌మ‌స్య‌లు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. 13 జిల్లాల ఆంధ్ర‌ప్ర‌దేశ్ 26 జిల్లాలుగా మార్చి ఏం సాధించారో ఇప్ప‌టికీ ఎవ్వ‌రికీ తెలియ‌దు. అర్థం కావ‌డం లేదు.

కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అంబేద్క‌ర్ కోనసీమ, నరసాపురం, బాపట్ల, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్‌ జిల్లాలు అమలులోకి వచ్చాయి అని అప్ప‌ట్లో అంతా సంతోషించారు కానీ అవి కూడా ఇప్పుడు పాల‌న సంబంధ వెసులుబాటును ఇంకా పొంద‌లేక‌పోతున్నాయి.

అంతేకాదు ఆర్డీఓల‌కూ జీతాలు లేవు. ఇటువంటి స్థితిలో క‌నీసం క‌లెక్ట‌రేట్ స్థాయి కార్యాల‌యాల‌కు కూడా పూర్తి సౌక‌ర్యాలు లేవు. ప్రొటొకాల్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప‌నిచేసే సిబ్బంది అస‌లే లేర‌ని ప్ర‌ధాన మీడియా చెబుతోంది.

ముఖ్యంగా ట్రెజ‌రీ ఇబ్బందులు అలానే ఉన్నాయి. ఖ‌జానా శాఖ‌కు సంబంధించి డీడీఓ కోడ్ తో ఆర్డీఓ కు కానీ ఇత‌ర సిబ్బందికి కానీ వేత‌నాలు చెల్లించాల్సి ఉన్నా, ఆ మేర‌కు చ‌ర్య‌లు లేవ‌ని దీంతో నెల‌ల త‌ర‌బ‌డి బిల్లులు పెండింగ్ లోనే ఉండిపోతున్నాయి అని ఆవేద‌న చెందుతున్నారు ఉద్యోగులు.

ఇదే విష‌యాన్ని ఇవాళ ప్ర‌ధాన మీడియా ధ్రువీక‌రిస్తోంది. అంతేకాదు పాల‌నా సౌల‌భ్యం పేరిట జిల్లాలు విభ‌జించారే కానీ ఎక్క‌డా క‌నీసం ఓ మీటింగ్ హాలు కు కూడా దిక్కే లేద‌ని, గ్రీవెన్స్ సెల్ (స్పంద‌న‌) నిర్వ‌హించాల‌న్నా ఇబ్బందులు త‌ప్ప‌డం లేదని క‌లెక్ట‌ర్లు వాపోతున్నారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇలాంట‌ప్పుడు జ‌గ‌న్ కొత్త జిల్లాలు ఎందుక‌ని ఏర్పాటు చేయాలి. ఏమీ చేయ‌లేన‌ప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో సాధించేదేమీ ఉండ‌దు క‌దా ! క‌నీసం కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేని వేళ మ‌న అధికారులు సాధించేదేంటి ? అని విప‌క్షం ఫైర్ అవుతోంది.