Begin typing your search above and press return to search.
అప్పుడు షా.. ఇప్పుడు మోడీ.. జగన్ కడిగేస్తారా?
By: Tupaki Desk | 2 Nov 2022 12:30 PM GMTఔను! ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఏపీకి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సీఎం జగన్ పెద్దగా స్పందించడం లేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలైన ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి, ఉక్కుఫ్యాక్టరీ, వెనుకబడిన జిల్లాలకు నిధులు, విశాఖ రైల్వే జోన్, విభజన హామీల అమలు వంటివాటిపై కేంద్రాన్ని ఆయన సరిగా ప్రశ్నించడం లేదని, నిలదీయడం లేదని, వాటిని సాధించడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షాలు తరచుగా ఈ అంశాలను ప్రస్తావిస్తూనే ఉన్నారు.
అయితే, జగన్ మాత్రం కేంద్రంలో పెద్ద మెజారిటీతో మోడీ ప్రభుత్వం బలంగా ఉందికాబట్టి, మనం ప్రశ్నించలేక పోతున్నామని చెప్పి చేతులు దులుపుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే, జగన్ నిజంగానే ఇలా ఉంటున్నారా? అంటే, లేదనే చెప్పాలి.
అవకాశం వచ్చినప్పుడు ఆయన వినియోగించుకుంటున్నారు. గత ఏడాది మొదట్లో తిరుపతి వేదికగా దక్షిణ ప్రాంత మండలి రాష్ట్రాల సమావేశం జరిగింది. దీనికి కేంద్రం నుంచి హోం శాఖ మంత్రి అమిత్ షానే నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా జగన్ తన వాదనను బలంగానే వినిపించారు.
ఫలితంగా హోదా, పోలవరం మినహా మిగిలిన అంశాలపై అంతో ఇంతో కదలిక వచ్చింది. ఈ క్రమంలో తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికా రులతో కేంద్రం సమావేశం నిర్వహించి ఆయా సమస్యలపై చర్చించింది. సరే.. ఫలితం వచ్చిందా రాలేదా అనేది పక్కన పెడితే కదలిక అయితే వచ్చింది. ఇక, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాధినేత పీఎం మోడీ ఈ నెలలో ఏపీకి వస్తున్నారు. విశాఖ కేంద్రంగా కొన్ని ప్రాజెక్టులకు ఆయన శంకు స్థాపన చేయనున్నారు. మరి దీనిని కూడా సీఎం జగన్ వినియోగించుకుంటారా? లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు మోడీ భయపడి వాటిని వదిలేస్తారా? అనేది ఆసక్తిగా మారింది.
ఆయా సమస్యలను వదిలేకుండా మోడీ ముందు గనుక ఆయన ప్రస్తావిస్తే సీఎం సీటుకు అంతో ఇంతో న్యాయం చేసినట్టు అవుతుందని వైసీపీలోన కొందరు తటస్థ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ''మా నాయకుడు ప్రశ్నించాలి.
అవి అవుతాయా.. కావా.. అనేది ఇప్పుడు ప్రశ్నకాదు. వాటిని ప్రశ్నిస్తే, అసలు ఏం జరుగుతోందనేది మోడీకి తెలుస్తుంది. ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. జగన్ అలా భయపడే నాయకుడు అని మేం భావించడం లేదు. ప్రశ్నిస్తారనే నమ్ముతున్నాం'' అని కొందరు వైసీపీ నాయకులు అంటున్నారు. మరి జగన్ వాటిని ప్రశ్నిస్తారో లేదోచూడాలి.
ఇక, ఇప్పుడు జరగబోయే ప్రధాని పర్యటన రాజకీయం కోసం కాదని కేంద్ర వర్గాలే చెబుతున్నాయి. సో, దీనిని అవకాశం గా మలుచుకునేందుకు సీఎం జగన్ కు చక్కని ఛాన్స్ అని కూడా చెబుతున్నారు వైసీపీ నాయకులు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా ఇప్పుడు దక్కిన అవకాశం వదిలేసుకుంటే మళ్లీ మోడీ ఏపీకి ఎప్పుడు వస్తారో చెప్పడం కూడా కష్టమే. గత ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన మోడీ మళ్లీ ఇప్పుడే వస్తున్నారు. సో మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.