Begin typing your search above and press return to search.
ఏపీలో అన్ని పార్టీలూ పిల్లులేనా?
By: Tupaki Desk | 5 July 2022 10:02 AM GMTఔను! ఇప్పుడు రాజకీయ వర్గాల నుంచి సామాన్యుల వరకు అందరి నోటా ఇదే వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలూ.. పిల్లులేనా? అని కామెంట్లు చేస్తున్నారు. దీనికి కారణం.. రాష్ట్రానికి సం బంధించిన ఏ ఒక్క సమస్యపై అయినా.. వారు కేంద్రాన్ని నిలదీయడం లేదు. కనీసం సాధించాలని కూడా వారు ప్రయత్నించడం లేదు. ఉండడానికి మూడు ప్రధాన పార్టీలు ఏపీలో పాగా వేశాయి. అయితే.. ఆయా పార్టీలు ఏపీ సమస్యలపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏమాత్రం కూడా నిలదీయడం లేదు.
అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని గట్టిగా నిర్ణయించుకు న్న పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన.. ఉన్నప్పటికీ.. రాష్ట్ర సమస్యలపై పెదవి విప్పడం లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ తప్పించుకునే ప్రయత్నంలోనే ఉన్నాయి.. తప్ప.. ఏపీకి న్యాయబద్ధంగా.. చట్టబద్ధంగా రావాల్సిన వాటిని మాత్రం తీసుకురావడంలో ఎక్కడా పనిచేయడం లేదనేటాక్ ఉంది. దీంతో ఏపీ పరిస్థితి ఎటూ తేలకుండా పోయింది.
వైసీపీని తీసుకుంటే.. గత 2019 ఎన్నికల్లో 25 మంది ఎంపీలను ఇస్తే.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని మెడ లు వంచి మరీ.. ప్రత్యేక హోదా, పోలవరం.. వెనుక బడిన జిల్లాల నిధులు.. విభజన చట్టంలోని అంశాల ను సాధిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రజలు ఆ పార్టీకి 22 మంది ఎంపీలను ఇచ్చారు. అయినప్పటికీ.. ఇప్పటి వరకు వైసీపీ సాధించింది ఏమీ కనిపించడం లేదు.
కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు బలంగా ఉందని.. ఇప్పుడు మనం ప్లీజ్.. ప్లీజ్.. అనడం తప్ప.. ఏమీ చేయలేమని జగన్ చేతులు ఎత్తేశారు. ఇక, వీలు కుదిరినప్పుడల్లా.. కేంద్రానికి సహకరిస్తూ.. తానే మెడలు వంచుకునే పరిస్థితిని తెచ్చుకున్నార ని.. జగన్‌పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. మరి దీనికి ఆయనపై ఉన్న కేసులో.. లేక.. మరే విషయమో తెలియదు కానీ.. కేంద్రం ముందు జగన్ చేతులుకట్టేసుకున్నారనే వాదన వినిపిస్తోంది.
ఇక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాష్ట్రంలో జగన్ సర్కారుపై విరుచుకుపడుతోంది. బాగానే ఉంది. కానీ... కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. రాజధాని నిర్మాణం, పోలవరం, ప్రత్యేకహోదా.. వంటి సమస్యలపై మాత్రం మౌనంగా ఉంటోంది. వాస్తవానికి ఇటు జగన్‌ను.. అటు కేంద్రాన్ని టార్గెట్ చేయడం ద్వారా.. ప్రజల్లో విశ్వాసం పొందే అవకాశం టీడీపీకి ఉంది. అయినా.. చంద్రబాబు ఆ తరహా వ్యూహాన్ని ఎక్కడా అమలు చేయడం లేదని అంటున్నారు పరిశీలకులు.
ఇక, బీజేపీతోనే పొత్తులోఉన్న పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడు తున్నారే తప్ప.. కేంద్రాన్ని మాత్రం పన్నెత్తు మాట అనడం లేదు. మరి ఆయన మిత్ర ధర్మం పాటిస్తు న్నారా? లేక.. నాకెందుకులే అని చేతులు ముడుచుకున్నారా? అనేది తేలాల్సి ఉంది. ఇదిలావుంటే.. ఈ పార్టీల అలుసు కనిపెట్టిన బీజేపీ పాలకులు.. ఏపీతో చెడుగుడు ఆడుతూనే ఉన్నారు. కనీసం ఏపీని పట్టించుకోవడం లేదు. తమకు అందివచ్చిన వారికి గుప్పిట పట్టి.. తమకు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏపీ హక్కులు.. హోదాలు.. ఆశలు.. అన్నీ.. నీరుగారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.