Begin typing your search above and press return to search.
పోలీస్ మంత్రి పోస్టు...ముందే కర్చీఫ్ వేసేస్తున్న తమ్ముళ్ళు
By: Tupaki Desk | 19 Jan 2023 2:54 PM GMTసినిమాల్లో అయినా రాజకీయాల్లో అయిన పోలీస్ అంటేనే పవర్ ఫుల్. చట్టం అన్నది బుక్స్ లో ఉంటుంది. కానీ నడిచే చట్టం పోలీస్. మరి అలాంటి పోలీసులకే సూపర్ బాస్ హోం మంత్రి. ఆ పోస్టుకు ఎపుడూ డిమాండ్ ఉంటుంది. అయితే కాంగ్రెస్ లో హోం మంత్రి అంటే సీఎం తరువాత పోస్టుగా భావించేవారు. ఒక విధంగా సూపర్ పవర్ సెంటర్ గా ఉండేది. తెలుగుదేశంలో కూడా ఉమ్మడి ఏపీలో రాజ్యం చేసినపుడు చేగొండి హరిరామ జూగయ్య, కోడెల శివప్రసాదరావు, కిమిడి కళా వెంకటరావు, ఎలిమినేటి మాధవరెడ్డి, దేవేందర్ గౌడ్ వంటి వారు హోం మంత్రులుగా బాగానే రాణించారు.
ఇక విభజన ఏపీలో మాత్రం చంద్రబాబు ఏలుబడిలో నిమ్మకాయల చినరాజప్ప హోం మంత్రిగా ఉన్నా పవర్ లెస్ గానే గడిపారు అని చెబుతారు. అయితే సీనియర్ నేతకు ఈ పదవి ఇస్తే చక్రం తిప్పేస్తారనే తమ మాట వినే నిమ్మలకు ఆ కీలక పదవి కట్టబెట్టారని అంటారు. ఇక వైసీపీ హయాంలో రెండు సార్లు మంత్రి పదవుల నియామకం జరిగినప్పటికీ హోం శాఖను మహిళలకే కేటాయించారు. అసలైన అధికారాలు వారికి లేవు అని విపక్షాలు విమర్శలు చేస్తూ వచ్చిన పరిస్థితి ఉంది.
ఇక వైసీపీ ఏలుబడిలో తెలుగుదేశం విపక్షంగా ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ పోలీసు కేసులు కానీ ఆ పార్టీ చరిత్రలో లేవు. దాంతో పోలీస్ వర్సెస్ టీడీపీగానే కధ సాగుతూ వస్తోంది. దాంతోనే హోం శాఖ మీద విమర్శలు వస్తున్నాయి. ఇక తాము అధికారంలోకి వస్తే వైసీపీ నేతల్తో పాటు పక్షపాతం చూపించే పోలీసుల పని పడతామని కూడా తమ్ముళ్ళు తరచూ అనడం అలవాటు అయింది.
ఇలా హో మంత్రి పోస్టు మీద మోజు పెంచుకుంటున్న వారు తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఉన్నారు. లేటెస్ట్ గా విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తానే రేపటి రోజున కాబోయే హోం మంత్రిని అని చెప్పుకున్నారు. లా అండ్ ఆర్డర్ ఏపీలో ఎలా అమలు చేయాలో ఆచరణలో చేసి చూపిస్తాను అని అయ్యన్నపాత్రుడు అంటున్నారు. తాను సీనియర్ నేతను కాబట్టి కీలక శాఖ తనకే ఉండాలని అయ్యన్న అలా కోరుకుంటున్నారు అని అంటున్నారు.
దీనికంటే ముందే ఏపీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు కూడా హోం శాఖ మంత్రి పదవి మీద కన్నేశారు. పంచాయతీ ఎన్నికల వేళ పోలీసులతో ఆయన ఘర్షణ పడుతూ రేపటి రోజున హోం మంత్రిగా తానే వస్తానని అందరి సంగతి చూస్తానంటూ ఘాటైన హెచ్చరికను జారీ చేశారు. ఈ ఇద్దరు నేతలే కాదు గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచి అర డజన్ కి తక్కువ లేకుండా తెలుగు తమ్ముళ్ళు హోం మంతిర్ పదవి మీద కర్చీఫ్ వేసేశారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. దాంతో తమకు అది అడ్వాంటేజ్ అవుతుందని, రేపటి ప్రభుత్వం తమదేనని అంచనాకు వస్తున్న తెలుగు తమ్ముళ్ళు కొత్త ప్రభుత్వలో తమ బెర్తులను కూడా కన్ ఫర్మ్ చేసేసుకుంటున్నారు. శాఖలను తామే ఎంచేసుకుంటున్నారు. అంటే ఇండైరెక్ట్ గా చంద్రబాబుకు తమకు ఆ శాఖ మీద కోరిక ఉందని చెబుతున్నారు అన్న మాట. అయితే ఎంత తెలుగుదేశానికి అనుకూలత ఉన్నా ఎన్నికల్లో గెలవాలి కదా ముందు ఆ పని చూడండి అని పార్టీ హితైషుల నుంచి సూచనలు వస్తున్నాయి. ఏది ఏమైనా పోలీసు మంత్రి అంటే ఫుల్ మోజు మీద తమ్ముళ్ళు ఉన్నారు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.