Begin typing your search above and press return to search.
టీడీపీ బ్రో.. వెరీ గుడ్డు బాయ్ బ్రో...
By: Tupaki Desk | 30 Oct 2022 5:30 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ అనుభవం చాణక్యాన్ని వేరే వారితో అసలు పోల్చడానికే లేదు. ఆయన రాజకీయ గండరగండ అని బిరుదు తెచ్చుకున్నారు. ఆయన బుర్ర నిండా వ్యూహాలే ఉంటాయి. అందుకే చంద్రబాబు తన పార్టీకి 2019 ఎన్నికల్లో 23 వచ్చినా కృంగి పోలేదు. అందులో నుంచి నలుగురైదుగురు జంప్ వైసీపీకి అయినా ఆయన నిరాశపడలేదు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని తన మామ ఎన్టీయార్ పాత సినిమా పాట పాడుకుంటూ ముందుకు సాగిపోయారు.
ఇపుడు బాబు అనుకున్నట్లుగానే ఫలితాలు వస్తున్నాయి. తమ్ముళ్లల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గత మూడున్నరేళ్లలో వైసీపీ టీడీపీని దెబ్బేయడానికి పన్నిన వ్యూహాలు వేసిన ఎత్తులు ఇన్నీ అన్నీ కావు. ఒక వైపు అరెస్టులతో కీలక నాయకులను బెంబేలెత్తించింది. మరో వైపు టీడీపీ ఆర్ధిక మూలాల మీద గట్టిగా దాడి చేసే చర్యలకు దిగింది అని ప్రచారం జరిగింది. ఇంకో వైపు చూస్తే మూడు రాజధానులు అంటూ ఏపీలో ఉప ప్రాంతీయ రాజకీయానికి తెర లేపింది.
దీని వల్ల టీడీపీ ఎక్కడికక్కడ చీలిపోయి తమ్ముళ్ళు కకావికలైపోయి టోటల్ గా టీడీపీ బలహీనం అవుతుంది అన్నదే వైసీపీ మాస్టర్ మైండ్ స్ట్రాటజీ. కానీ ఆచరణలో మాత్రం అలా జరగలేదు. జగన్ సర్కార్ 2020 మొదట్లో మూడు రాజధానులు అన్నపుడు విశాఖ నుంచి కొందరు టీడీపీ తమ్ముళ్ళు గొంతెత్తి అనుకూల నినాదాలు చేశారు. శ్రీకాకుళం నుంచి చూస్తే మాజీ మంత్రి కోండ్రు మురళీమోహనరావు లాంటి వారు మూడుకు జై కొట్టారు. దాంతో టీడీపీ బీటలు వారుతుందని, వైసీపీ ట్రాప్ లో తమ్ముళ్ళు చిక్కుకున్నారని అంతా భావించారు.
కానీ కాలగమంలో మాత్రం అలా ఎక్కడా జరగలేదు. టీడీపీ నుంచి ఉప ప్రాంతీయ వాదం లేవకుండా ఎప్పటికపుడు చంద్రబాబు తగిన చర్యలు తీసుకున్నారు. ఒక వైపు అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తూ ఏకైక రాజధాని నినాదానికి ఊపిరులూదుతూ మరో వైపు ఉత్తరాంధ్రా రాయలసీమ తమ్ముళ్ళు వికేంద్రీకరణ మంత్రం పఠించకుండా సక్సెస్ ఫుల్ గా నిలువరించగలిగారు.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు మూడున్నరేళ్ళు ఇట్టే జరిగిపోయాయి. ఇపుడు వైసీపీ ఆద్వర్యంలో ఎక్కడికక్కడ గర్జనలు జరుగుతున్నాయి. విశాఖ గర్జన తరువాత తిరుపతిలో సీమ ఆత్మగౌరవ సభ అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంతలా అటూ ఇటూ వైసీపీ ఉద్యమాలు చేయిస్తున్నా తమ్ముళ్ళు మాత్రం తడబాటు పడడం లేదు. ఎక్కడా తొణకడం లేదు. తమ అధినాయకుడు చెప్పిన దానికే కట్టుబడి ఉన్నారు. ఏకైక రాజధాని అమరావతే అని అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం దాకా తమ్ముళ్ళు బిగ్గరగా తన వాణిని వినిపిస్తున్నారు.
దానికి హై కోర్టు ఇచ్చిన తీర్పు వారికి కొండంత నైతిక స్థైర్యం ఇచ్చింది. అదే టైం లో మూడు రాజధానుల పట్ల అనుకున్న విధంగా జనంలో వైసీపీకి అనుకూల స్పందన రాకపోవడం కూడా తమ్ముళ్లు రెండవ ఆలోచన లేకుండా జై అమరావతి అని అనడానికి దోహదపడ్డాయి. ఇలాంటి సానుకూల పరిస్థితులు తీసుకురావడం వెనక బాబు రాజకీయ చాణక్యం కూడా ఉందని ఇక్కడ మరచిపోరాదు.
విశాఖ రాజధాని అని వైసీపీ నినదిస్తూంటే అక్కడ భూ కబ్జ్దాలు శాంతి భద్రతల అంశం టీడీపీ తెలివిగా లేవనెత్తి జనం నుంచి అనుకున్న పాజిటివ్ రియాక్షన్ రాకుండా చేసింది. అలాగే రాయలసీమకు హై కోర్టు వస్తే ఒరిగేది ఏముటుంది, సాగు నీటి ప్రాజెక్టులతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కావాలి అంటూ టీడీపీ ఇస్తున్న పిలుపు కూడా ఆలోచనలలో పడేసింది అంటున్నారు.
మొత్తానికి టీడీపీ ఎన్నికల వేళ ఒక్కటిగా పటిష్టంగా ముందుకు కదులుతోంది. మూడు రాజధానుల పేరిట ముప్పేట దాడి చేద్దామనుకున్న వైసీపీకి ఇది మింగుడుపడని పరిణామంగా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా బాబు గీసిన గీతను దాటని తమ్ముళ్ళు గుడ్ బ్రదర్స్ అనిపించుకుంటున్నారు అని అంటున్నారు అంతా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.