Begin typing your search above and press return to search.
3 రాజధానుల హైకోర్టు తీర్పు రద్దుపై సుప్రీంలో జగన్ సర్కారు వాదన ఇదే!
By: Tupaki Desk | 18 Sep 2022 4:43 AM GMTఏపీలో ముందుగా డిసైడ్ చేసి.. శంకుస్థాపన చేసి.. ఇప్పటికే పలు నిర్మాణాల్ని చేపట్టిన అమరావతిని కాదని.. మూడు రాజధానుల నిర్మాణంపై తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు తప్పు పట్టిన వైనంపై ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ సర్కారు న్యాయపరమైన పోరాటానికి తెర తీసింది. ఇందులో భాగంగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ ఏడాది మార్చి 3న ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసింది. మూడు రాజధానుల ఏర్పాటు నిమిత్తం చట్టం చేసే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదన్న హైకోర్టు తీర్పును తప్పు పడుతూ.. దాన్ని రద్దు చేయాలంటూ స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ సందర్భంగా తన వాదనను జగన్ సర్కారు వినిపించింది. సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ లో ఏమని పేర్కొన్నదంటే..
- రాజ్యాంగంలోని అధికరణలు 3.. 4లను అనుసరించి కేంద్రం తీసుకొచ్చిన చట్టం ద్వారా రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి లేదని చెప్పటం లౌకిక సూత్రాలకు విరుద్దం.
- రాజ్యాంగంలోని అధికరణ 258 ద్వారా కేంద్రం బదలాయించిన అధికారంతో రాష్ట్ర ప్రభుత్వం సీఆర్ డీఏ చట్టం తెచ్చినట్లు హైకోర్టు తన తీర్పులో చెప్పింది. వాస్తవానికి రాజ్యాంగంలోని లిస్టు రెండు ఐదవ ఎంట్రీలోని అధికారాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం సీఆర్ డీఏ చట్టాన్ని తెచ్చింది.
- రాష్ట్రం కానీ కేంద్రం కానీ కేంద్రం బదలాయించిన అధికారం ద్వారా సీఆర్ డీఏ చట్టాన్ని చేసినట్లు ఎక్కడా చెప్పలేదు.
- రాజధాని వ్యవహారంలో రాష్ట్రాల పరిధిలోకి రాదంటూ కేంద్రమే లిఖిత పూర్వకంగా అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు నివేదించింది.
- అధికరణ 258 కింద ఉన్న కార్యనిర్వాహక.. పాలన అధికారాల్ని మాత్రమే బదలాయించటం జరుగుతుందే తప్పించి శాసనాధికారాన్ని కాదు.
- సీఆర్ డీఏ చట్టాన్ని కేంద్రం బదలాయించిన అధికారం ద్వారానే చేశామనుకుంటే.. విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఏర్పాటైన కమిటీ చేసిన సిఫార్సులకు విరుద్ధంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించారని భావించాల్సి ఉంటుంది.
- కేంద్రం ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా తీసుకున్న నిర్ణయం కేంద్ర చట్టానికి విరుద్ధమైనప్పుడు దాన్ని హైకోర్టు సమర్థించగలదా?
- ల్యాండ్ పూలింగ్ స్కీం కింద నిర్వర్తించాల్సిన బాధ్యతలను నిర్వర్తించలేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది.
- ఒప్పందాలకు అనుగుణంగా సీఆర్ డీఏ.. ల్యాండ్ పూలింగ్ నిబంధనల పరకారంరాజధాని ప్రాంతంలో రోడ్లు.. తాగునీరు.. డ్రైనేజీ.. విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలతో రాజధాని ప్రాంతం డెవలప్ మెంట్ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించటంపై అభ్యంతరం.
- రోడ్లు.. తాగునీరు.. విద్యుత్.. డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలతో నివాసయోగ్యమైన రీతిలో ప్లాట్లను డెవలప్ చేసి వాటిని 3 నెలల్లో ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన యజమానులకు అప్పగించాలన్న హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరం.