Begin typing your search above and press return to search.

మ‌హిళా మంత్రుల‌పై పాజిటివ్ టాక్‌.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   12 July 2022 10:30 AM GMT
మ‌హిళా మంత్రుల‌పై పాజిటివ్ టాక్‌.. రీజ‌నేంటి?
X
ఏపీలోని జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో మ‌హిళా మంత్రులు దుమ్మురేపుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. రోజా, విడ‌ద‌ల ర‌జ‌నీ, తానేటి వ‌నిత‌. వీరిలో వ‌నిత‌కు రెండోసారి కూడా అవ‌కాశం ద‌క్కింది. ఇక‌, మిగిలిన ఇద్ద‌రు మాత్రం కొత్త‌గా మంత్రి ప‌ద‌వులు చేప‌ట్టారు. అయితే.. మంత్రులుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ముగ్గురు కూడా బాగానే ప‌నిచేస్తున్నార‌నే టాక్ వినిపిస్తుండడం గ‌మ‌నార్హం.

ఈ ముగ్గురులోనూ.. ఇద్ద‌రు.. రోజా, ర‌జ‌నీలు.. మ‌రింత దూకుడుగా ప‌నిచేస్తున్నార‌ని.. వైసీపీలోనే ఒక టాక్ న‌డుస్తోంది. ఎక్క‌డ ఏ స‌మ‌స్య‌వ‌చ్చినా.. వెంట‌నే రియాక్ట్ అవుతున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంచి వాయిస్ వినిపిస్తున్నారు.

ఇక‌, ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌పై కూడా ఆచి తూచి స్పందిస్తూ.. గ‌ట్టిగానే కౌంట‌ర్లు ఇస్తున్నారు. మరి దీనికి కార‌ణం ఏంటి? జ‌గ‌న్ ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌నే ద్రుఢ నిర్ణ‌య‌మా? లేక ఏదైనా ఉందా? అనేది ఇంట్ర‌స్టింగ్‌గా మారింది.

జ‌గ‌న్‌పై భ‌క్తి కార‌ణంగా.. అవ‌కాశం ఇచ్చార‌నే భావ‌న ఉన్న‌మాట వాస్త‌వ‌మే. అయితే.. ఇంత‌కు మించి.. రోజా, ర‌జ‌నీల కు భ‌యం ప‌ట్టుకుంద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. చిత్రంగా వైసీపీలో ఈ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల కు.. సొంత పార్టీలోనే చెక్ పెట్టేవారు ఉన్నార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.

రోజా అంటే.. ప‌డ‌ని మం త్రులు.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెకు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్న వారు ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే త‌న చుట్టూ ఉన్న థ్రెట్ను త‌ప్పించుకునేందుకు రోజా చెమ‌టోడుస్తున్నార‌ని అంటున్నారు.

ఇక‌, ర‌జ‌నీ విష‌యాన్ని తీసుకుంటే.. త‌న‌ను తాను నిరూపించుకోవాల‌నే త‌ప‌న‌తోపాటు. తొలిసారి రాజ‌కీ య అరంగేట్రంతోనే ద‌క్కిన ప‌ద‌వికి న్యాయం చేసి.. త‌న‌కు వ్య‌తిరేకంగా.. చక్రం తిప్పాల‌ని భావిస్తున్న కొంద‌రు నాయ‌కుల‌కు చెక్‌పెట్టాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌నే గెలిచి తీరాల‌నే త‌ప‌న‌తో ఉన్నార‌ని అం టున్నారు. అందుకే ఆమె కూడా.. ప‌నిచేస్తున్నార‌ని అంటున్నారు. ఏదేమైనా.. ఈ ఇద్ద‌రు మ‌హిళా మంత్రు లపై మాత్రం పాజిటివ్ టాక్ న‌డుస్తుండ‌డం వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.