Begin typing your search above and press return to search.
ప్రజలకు మైండ్ వాష్.. ఇక, హోరెత్తనున్న 'సంక్షేమం'
By: Tupaki Desk | 16 Dec 2022 9:30 AM GMTఏపీ ప్రజలకు ఇక, మైండ్ వాష్ ఖాయం. ఇదీ.. ఇప్పుడు నెటిజన్లు చేస్తున్న కామెంట్లు. ముఖ్యంగా ఎన్నారై లు అయితే..మరింత ఆసక్తిగా స్పందిస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఏపీలో ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తనుంది.
మరీ ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వమే ముందుగా ఈ ప్రచార వ్యూహంలోకి పదునుగా అడుగులు వేసింది. ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం ఉద్దేశం ఎన్నికల ప్రచారం.
మరోవైపు వలంటీర్ వ్యవస్థ కూడా ఎంత కాదన్నా.. ఎన్నికల ప్రచారాన్ని భుజాన వేసుకుంది. ప్రతి నెలా పింఛన్ ఇస్తున్నా.. బియ్యం ఇస్తున్నా.. వలంటీర్లు గత మూడు మాసాల నుంచి కూడా జగన్ పేరును ప్రస్తావించకుండా.. ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రస్తావించకుండా మాత్రం ఇవ్వడం లేదు. అంటే. ఒకరకంగా.. ఇది ప్రచారమే. ఇక, దీని సంగతి ఎలా ఉన్నప్పటికీ.. త్వరలోనే గృహ సారథులు వస్తున్నారు.
ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున ప్రతి రోజూ.. ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా.. తిరుగుతారు. వారి కాన్సెప్ట్ ఏంటంటే.. ప్రజలను వైసీపీవైపు మళ్లించి.. మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే.
ఇది వైసీపీ కి మేలు చేసే కార్యక్రమం అయితే.. మరోవైపు.. ప్రజల బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమమని అంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఇంటా బయటా.. నాయకులు చేస్తున్న ప్రచారం తెలిసిందే.
దీనికితోడు మీడియా ముందు విమర్శలు వంటివి వినలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం. ఇక, ఇప్పుడు.. 50 ఇళ్లకు ఇద్దరిని పెట్టి.. ప్రతి ఇంటికీ పంపించి.. ప్రభుత్వ సంక్షేమంపై వివరించడం.. వారిని వైసీపీకి ఓటేసేలా తీర్చదిద్దడం అంటే.. ఖచ్చితంగా ప్రజలకు బ్రెయిన్ వాచిపోయేలా.. వారికి చెప్పిందే చెబుతారనే వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం మంచిదే అయినా.. ఇలా.. టికెట్ కోసం.. స్టేషన్‌లో టీసీ నిలబెట్టినట్టు ప్రజలను నిలబెట్టి వాయించేయడం.. నవ్వు తెప్పిస్తోందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.