Begin typing your search above and press return to search.

అంగన్ వాడీ టీజర్ మృతి.. టీకా కారణం కాదన్న హెల్త్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   31 Jan 2021 2:37 PM GMT
అంగన్ వాడీ టీజర్ మృతి.. టీకా కారణం కాదన్న హెల్త్ డైరెక్టర్
X
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో హెల్త్ వర్కర్ సుశీల మృతికి వ్యాక్సిన్ కారణం కాదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు ప్రకటించారు. ఇతర ఆరోగ్య కారణాల వల్లే సుశీల మృతి చెందిందని తెలిపారు.

టీకా వేయించుకున్న 10 రోజుల తర్వాత సుశీల అనారోగ్యానికి గురయ్యారని.. వ్యాక్సిన్ తో మరణాలు సంభవించవని శ్రీనివాసరావు తెలిపారు.

మంచిర్యాల జిల్లాలోని కరోనా వ్యాక్సిన్ వేసుకున్న హెల్త్ వర్కర్ సుశీల (60) మృతి చెందడం విషాదం నింపింది. ఈనెల 23న ఆమె వ్యాక్సిన్ తీసుకున్నారు. వెంటనే అస్వస్థతకు గురికావడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఆమె పరిస్థితి విషమించడంతో నిన్న హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ సుశీల మృతి చెందింది.

ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల హెల్త్ వర్కర్లు అనారోగ్యానికి గురయ్యారు. కొందరు మరణించారు. అయితే వ్యాక్సిన్ కారణంగానే వారు మరణించారని వైద్యఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించలేదు.