Begin typing your search above and press return to search.
చావు ఆమెకు భయపడి పరార్!
By: Tupaki Desk | 30 Sep 2020 11:30 PM GMTచావు మన చేతిలో లేదు. ఒక్కోసారి మనం చావాలని ప్రయత్నించినా..చావు మన దరికి చేరదు. ఒక్కోసారి ఇలా కూడా చావు వస్తుందా అన్న విధంగా కొందరు చనిపోతుంటారు. కొందరు రైలు కిందపడి చావాలని రెండు పట్టాల మధ్య పడుకుంటే..తమ మీదుగా రైలు వెళ్లినా..బతికి బట్టకట్టడం చూస్తుంటాం..భూమ్మీద నూకలు మిగిలి ఉంటే చచ్చినా చావు మన దరికి చేరదు.అనే సామెత వింటూ ఉంటాం ఓ మహిళ విషయంలో జరిగింది. కొలంబియాలో ఎంజెలికా గైటన్ అనే ఓ మహిళకు పుట్టెడు కష్టాలు రావడంతో భరించలేక సముద్రంలోకి దూకి చనిపోవాలనుకుంది. కానీ ఆమెకు చావు రాత లేదనుకుంటా. మునిగి పోకుండా ఎనిమిది గంటలపాటు నీటిమీదనే తేలుతూ ఉంది. ఆలోగా అటుగా వచ్చిన మత్స్యకారులు చూసి ఆమెను ఒడ్డుకు చేర్చారు. ఎనిమిది గంటలు నీటిలో ఉండి మునిగి పోలేదంటే ఆ దేవుడు తన చావును కోరుకోలేదని ఆమె ఇప్పుడు సంతోషంగా చెబుతోంది. తనకు ఇది పునర్జన్మ అని తెలుపుతోంది.
కొలంబియాలో ఎంజెలికా గైటన్ అనే మహిళకు పెళ్లి అయినప్పటి కష్టాలే. రోజూ భర్త చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇద్దరు చిన్న పిల్లలు ఉండటంతో వారిని చూసుకుంటూ నిస్సహాయురాలిగా మారింది. భర్త వేధింపులు భరించలేక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు అతడిని ప్రతిసారి ఒకటి రెండు రోజులు హెచ్చరించి పంపేవారు. ఇక అతడు మళ్లీ ఇంటికి వచ్చాక భార్యకు నరకం చూపేవాడు. రెండేళ్ల కిందట ఆమెను చంపే ప్రయత్నం కూడా చేశాడు. దీంతో ఎంజెలికా గైటన్ ఇంట్లో నుంచి పారిపోయింది. ఓ ఆరు నెలల పాటు అలా వీధుల్లోనే తల దాచుకుంది. తర్వాత కామినో డిఫే రెస్క్యూ సెంటర్‌లో ఆశ్రయం దొరకడంతో అక్కడ కొన్నాళ్ళు ఆశ్రయం పొందింది. వాళ్లు కూడా ఆమెను ఎక్కువ రోజులు తమ దగ్గర ఉండనివ్వలేదు. గడువు తీరాక బయటకు వెళ్లిపొమ్మన్నారు. ఇక తనకు చావే దిక్కని గైటన్ నిర్ణయించుకుంది. ఓ రోజు కొలంబియా సముద్రంలో దూకేసింది.అలా కాసేపటికి స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమె ఆశ్చర్యంగా ఎనిమిది గంటలపాటు అలా సముద్రంలోనే తేలుతూనే ఉండిపోయింది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఆమె నీటిలో తేలుతూ ఉండటం కనిపించింది. ఆమెను వారు రక్షించి గట్టుకు చేర్చారు. అలా గైటన్ చావు ఎదురు వెళ్లి బయట పడింది. ఇప్పుడు తనది కొత్త జన్మ అని ఆమె చెబుతోంది.