Begin typing your search above and press return to search.

ల‌వ్వ‌ర్ కోసం వేల కోట్ల‌ను వ‌దిలేసింది

By:  Tupaki Desk   |   5 Aug 2017 4:36 AM GMT
ల‌వ్వ‌ర్ కోసం వేల కోట్ల‌ను వ‌దిలేసింది
X
ఇది రీల్ క‌థ కాదు. రియ‌ల్ క‌థ‌. ప్రేమ ముందు ఏదైనా లైట్ మాట‌కు నిలువెత్తు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ప్రేమించిన ప్రియుడు కోసం వేల కోట్ల రూపాయిల ఆస్తిని లైట్ తీసుకున్న ఒక అమ్మ‌డి క‌థ‌. వీరి ప్రేమ క‌థ మొద‌లై.. పెళ్లి జ‌రిగిపోయి చాలా కాల‌మే అయినా.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో ఆమె చేసిన త్యాగం ప్ర‌పంచానికి తెలిసేలా చేసింది.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ఈ ఉదంతం ఎక్క‌డ జ‌రిగింది? ల‌వ్వ‌ర్ కోసం వేల కోట్ల రూపాయిల్ని వ‌దిలేసిన ఆ భామ ఎవ‌రు? అన్న విష‌యాల్లోకి వెళితే.. ముందుగా మ‌లేషియా వెళ్లాలి. అక్క‌డి బిజినెస్ టైకూన్ల‌లో ఒక‌రైన ఖూకే పెంగ్ గురించి తెలుసుకోవాలి. మిగిలిన విష‌యాల్ని ప‌క్క‌న పెడితే ఖూకే పెంగ్ కు వ్యాపారాల్లో తిరుగులేదు. ఆయ‌నకు బోలెడంత ఆస్తిపాస్తులు ఉన్నాయి.

ఆయ‌న భార్య పాలిన్ చాయ్ మాజీ మిస్ మ‌లేషియా. ఈ జంట‌కు పుట్టిన ఐదో సంతానం ఏంజెలినా . మ‌నం ఇప్పుడు చెప్పుకున్న వేలాది కోట్లు వ‌దిలేసుకున్న అమ్మాయి. ఆమె ఓ ఫ్యాష‌న్ డిజైన‌ర్ ను ప్రేమించింది. ఆ విష‌యాన్ని ఇంట్లో వారికి చెప్పింది. ఆమె ల‌వ్ స్టోరీకి త‌ల్లి ఓకే అనేసింది. కానీ.. తండ్రి మాత్రం నో చెప్పేశారు. ల‌వ్వ‌ర్ కావాలా? వేల కోట్ల ఆస్తి కావాలా? అన్న సూటి ప్ర‌శ్న వేశారు.

ఈ విష‌యంలో ఏంజెలీనా అంద‌రికి షాక్ తగిలేలా.. త‌నకు ప్రియుడే ముఖ్య‌మ‌ని.. వేల కోట్ల ఆస్తి లైట్ అని వ‌దిలేశారు. ఇంటిని విడిచి ప్రియుడ్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ ను గ‌డిపేస్తున్నారు. క‌థ ఇంతవ‌ర‌కూ బాగానే ఉంది. ఏంజెలీనా చేసిన త్యాగం బ‌య‌ట‌కు రాలేదు. ఆ మాట‌కు వ‌స్తే.. అలా ప్ర‌చారం చేసుకోవ‌టం ఆమెకు ఇష్టం లేద‌ట‌. అయితే.. అనూహ్యంగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో ఆమె చేసిన ప‌ని ప్ర‌పంచానికి తెలిసేలా చేసింది.

ఇటీవ‌ల ఏంజెలీనా త‌ల్లిదండ్రులు విడాకులు తీసుకున్న విష‌యాన్ని తెలుసుకుంది. త‌న న‌లుగురు అక్క‌ల‌తో క‌లిసి ఏంజెలీనా కూడా త‌ల్లికే స‌పోర్ట్ చేసింది. 43 ఏళ్ల వైవాహిక బంధం త‌ర్వాత ఖూకే పెంగ్‌.. షాలిన్ చాయ్ విడాకులు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న తండ్రికి 2015లో 408 మిలియ‌న్ డాల‌ర్ల ఆస్తితో మ‌లేషియాలోనే అత్యంత ధ‌నికుల్లో ఒక‌ర‌ని ఏంజెలీనా తెలుసుకుంది. ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు సంబంధించిన విష‌యాలు బ‌య‌ట‌కు చెప్ప‌టంతో.. ప్రేమ కోసం ఆమె చేసిన త్యాగం ప్ర‌పంచానికి తెలిసేలా చేసింది. ప్రేమ కోసం వేల కోట్ల‌ను వ‌దిలేసిన ఏంజెలీనా ప్రియుడితో హ్యాపీగా గ‌డుపుతున్నారు.ఆమె ప్రేమ క‌థ సోష‌ల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.