Begin typing your search above and press return to search.
కొడుకు మీద కోపం.. ఆస్తిలో సగం కుక్కకు రాసేశాడు
By: Tupaki Desk | 1 Jan 2021 10:13 AM GMTకొడుకు మీద కోపం వచ్చిన ఒక తండ్రి తీసుకున్న నిర్ణయం షాకింగ్ గానే కాదు.. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. విపరీతంగా వైరల్ అవుతున్న ఈ ఉదంతం మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఛింద్వాడా జిల్లాకు చెందిన ఓం నారాయణ అనే వ్యక్తికి ఒక కొడుకు ఉన్నాడు. అతడి ప్రవర్తన ఏ మాత్రం బాగుండదు. ఎంత చెప్పినా మాట వినని పరిస్థితి. దీంతో విరక్తి చెందిన అతడు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు.
కొడుకు తీరు ఇలా ఉంటే.. తాను పెంచుకునే పెంపుడు కుక్క జాకీ అంటే అతనికి చాలా ఇష్టం. అది కూడా నారాయణ పట్ల బాగుండేది. దీంతో.. కొడుకు మీద విరక్తి చెందిన అతడు తన ఆస్తిలో సగాన్ని తన రెండో భార్యను.. మిగిలిన సగాన్ని జాకీకి రాసేస్తూ వీలునామా రాశారు. తన భార్య.. తన పెంపుడు కుక్క తనను బాగా చూసుకుంటున్నారని.. అందుకే తన ఆస్తి మొత్తాన్ని వారిద్దరి పేరున రాసినట్లుగా వెల్లడించారు. తాను చనిపోయిన తర్వాత తన ఆస్తి వారికే చెల్లుతుందని.. అయితే తాను మరణించిన తర్వాత ఎవరైతే జాకీని చక్కగా చూసుకుంటారో.. వారికే దాని ఆస్తికి వారసులు అవుతారని పేర్కొనటం ఆసక్తికరంగా మారింది.