Begin typing your search above and press return to search.
కోపం.. బాధ.. ఫస్ట్రేషన్.. ఈ ఎస్సై ఇలా చూపించాడు..
By: Tupaki Desk | 16 Nov 2019 10:18 AM GMTకోపం.. బాధ.. ఫస్ట్రేషన్.. ఎలా చెప్పాలో ఆ పోలీస్ అధికారికి తెలియలేదు.. తన తప్పు లేకున్నా అలిగేషన్స్ కారణంగా బదిలీ చేయడాన్ని తట్టుకోలేకపోయాడు. అంతే లేడికి లేచించే పరుగు అన్నట్టుగా ఓ ఎస్సై రోడ్డుపై పరిగెట్టాడు. దాదాపు 65 కి.మీల అతడి నిరసన పరుగు పూర్తికాకుండానే మధ్యలోనే ఆగిపోయింది. ఆయాసం వచ్చి కుప్ప కూలిన ఆ ఎస్సై ఎందుకు అలా పరిగెట్టాడని తెలుసుకొని అందరూ షాక్ తిన్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని పోలీస్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో విజయ్ ప్రతాప్ సింగ్ అనే ఎస్సై పనిచేస్తున్నారు. చాలా నిజాయితీగల అధికారిగా పేరుంది. అయితే తాజాగా అతడిని పోలీస్ ఉన్నతాధికారులు అక్కడికి 65 కిలోమీటర్ల దూరంలోని బిథౌలికి బదిలీచేశారు.
అయితే తనను అకారణంగా బదిలీ చేశారని.. తాను పోలీస్ లైన్స్ లోనే ఉంటానని ప్రతాప్ సింగ్ తన సీనియర్ ఎస్సీకి విన్నవించారు. అయితే ఆర్ఐ ఒత్తిడి వల్లే నీ బదిలీ అయ్యిదంటూ ఆయన చేతులెత్తేశాడు. దీంతో ఆర్ఐని ఏమీ అనలేక.. కోపాన్ని అనుచుకోలేక పోలీస్ లైన్స్ పోలీస్ స్టేషన్ నుంచి బిథౌలికి పరుగు మొదలు పెట్టాడు. తాను ఇలానే పరిగెడుతూనే బిథౌలికి చేరుకుంటానని.. అలా తన నిరసనను ఉన్నతాధికారుల కు తెలియజేస్తానని ఎస్సై ప్రతాప్ సింగ్ పరుగు అందుకున్నాడు.
అయితే అక్కడి కి చేరకుండా ఆ ఎస్సై ఆయాసం ఎక్కు కుప్ప కూలాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇలా ఓ ఎస్సై బదిలీ చేసిన పాపానికి తన నిరసనను పరిగెడుతూ తెలిపాడు. ఈ విషయం వైరల్ అయ్యి పోలీస్ ఉన్నతాధికారుల కు తల నొప్పిగా మారింది. సదురు పోలీస్ కు సానుభూతి వ్యక్తం అవుతుండగా.. పోలీస్ బాస్ లు మాత్రం బుక్కైపోయారు.