Begin typing your search above and press return to search.
సెల్ఫీ అడిగినందుకు ఫోన్ విసిరేశాడు
By: Tupaki Desk | 15 Jan 2017 2:47 PM GMTప్రముఖులకు అభిమానులంటే అంత లోకువ ఎందుకో అర్థం కాదు. కారణం ఏమైనా కానీ.. తమను అభిమానించే వారి విషయంలో పలువురు ప్రముఖులు ఈ మధ్యన తమ దురుసు ప్రవర్తనతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. కాస్తంత సహనం.. ఓపికను ప్రదర్శిస్తే సరిపోయే దానికి.. అందుకు భిన్నంగా ఆవేశానికి లోనై.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనం విమర్శలకు తావిస్తోంది. తాజాగా అలాంటి పనే చేసిన క్రికెటర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.
రంజీ ట్రోఫీలో 41 సార్లు ఛాంపియన్ అయిన ముంబయిపైన ఘన విజయాన్నిసాధించింది గుజరాత్ జట్టు. ఇదో రికార్డుగా చెప్పొచ్చు. ఈ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేసిన ఆర్పీసింగ్ వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతగాడు ఫీల్డింగ్ చేసే సమయంలో పలువురు ప్రేక్షకులు అతనితో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. దీంతో విసుగుకు లోనైన ఆర్పీ సింగ్ ఫోన్ తీసుకొని విసిరేసిన వైనం అభిమానులకు మండిపోయేలా చేసింది. అభిమానంతో సెల్ఫీ అడిగితే ఇలా చేస్తారా? అంటూ పలువురు ఆగ్రహంతో ప్రశ్నిస్తారు. సెల్ ఫోన్ ను విసిరేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/