Begin typing your search above and press return to search.
సన అసలు కథ బయటకొచ్చింది
By: Tupaki Desk | 14 Nov 2015 6:06 AM GMTమాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన ఘోర ప్రమాదం.. అందులో ఆయన కోడలు.. ముగ్గురు మనమలు మృతి చెందటం తెలిసిందే. ఈ వ్యవహారంలో రాజయ్య.. ఆయన సతీమణి.. కొడుకు అనిల్ లు ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అనిల్ కు సన అనే రెండో భార్య ఉందన్న విషయం సారిక మృతితో బయటకు రావటంతో.. ఆమెను ఈ కేసులో ఏ4గా కేసులో చేర్చటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సన గురించి వెతికిన పోలీసులకు.. ఆమె తాజాగా పోలీసుల చేతికి చిక్కినట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే.. సనను పోలీసులు అదుపులోకి తీసుకోలేదని.. ఆమె ఒక మధ్యవర్తి సాయంతో పోలీసుల వద్ద లొంగిపోయిందని చెబుతున్నారు. అసలు రాజయ్య కుమారుడు అనిల్ కు.. సనకు మధ్యన సంబంధం ఎలా షురూ అయ్యింది? ప్రస్తుత స్టేటస్ ఏమిటన్న అంశంపై పోలీసులు ఆసక్తి ప్రదర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు సనను విచారించినట్లుగా తెలిసిందే. అనిల్ తో తన పరిచయం మొదలు.. ఇప్పుడున్న పరిస్థితుల వరకూ అన్నీ వివరంగా చెప్పినట్లుగా తెలిసింది.
కాజీపేటలోని ఫాతిమా నగర్ లో బ్యాంగిల్ స్టోర్ నిర్వహిస్తున్న సనకు ఒక మిస్డ్ కాల్ ద్వారా అనిల్ పరిచయం అయ్యాడని.. ఆ తర్వాత ఆ పరిచయం పెరిగి స్నేహంగా మారి.. ప్రేమగా రూపాంతరం చెంది.. పెళ్లి వరకూ వెళ్లినట్లుగా పేర్కొన్నట్లు సమాచారం. పెళ్లి అనంతరం సికింద్రాబాద్ కు ఇంటిని షిఫ్ట్ చేశారని.. అయితే.. అనిల్ తన గురించి సనకు మొదట చెప్పలేదని తెలుస్తోంది.
అనిల్ ద్వారా తొలి సంతానం కలిగే వరకూ.. అతను సిరిసిల్ల రాజయ్య కుమారుడని.. అతనికి పెళ్లి అయి.. పిల్లలు ఉన్న విషయం తనకు తెలీదని సన పేర్కొన్నట్లు చెబుతున్నారు. విషయం మొత్తం బయటకు వచ్చిన తర్వాత.. అనిల్ కు.. సనకు మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు చెప్పినట్లు సమాచారం. గొడవలు పెరిగి.. అనిల్ తో బంధం తెంచుకునేందుకు తాను సిద్ధమైన నేపథ్యంలో సిరిసిల్ల రాజయ్య ఫ్యామిలీ నుంచి ఇందుకు రూ.10లక్షలు పరిహారంగా ఇస్తామని పేర్కొన్నారని.. అయితే.. అనుకున్న విధంగా డబ్బులు ఇవ్వటం ఆలస్యమైందని.. ఆ క్రమంలోనే సారిక మృతి చెందిందని.. తాను అనవసరమైన ఇబ్బందుల్లో పడినట్లుగా సన వాపోయినట్లు చెబుతున్నారు. పోలీసులకు లొంగిపోయేందుకు వచ్చిన సన.. తనతో పాటు.. తన చిన్నారి కొడుకును కూడా తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. సన చెప్పిన అంశాల్ని మరోమారు విచారణ చేయల్సి ఉందన్న అభిప్రాయాన్ని పోలసులు పేర్కొంటున్నారు. మరి.. సన చెప్పిన దాన్లో నిజం ఎంతన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.