Begin typing your search above and press return to search.
సుప్రీం కోర్టులో అనిల్ అంబానీకి ఎదురుదెబ్బ!
By: Tupaki Desk | 20 Feb 2019 8:01 AM GMTసుప్రీం కోర్టులో అనిల్ అంబానీకి ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ గ్రూపు సంస్థ ఛైర్మన్ అనిల్ అంబానీ ఎరిక్సన్ సంస్థకు రూ.450 కోట్ల బకాయి ఉన్న విషయం తెల్సిందే. ఎరిక్సన్ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఆ సంస్థకు డబ్బులు చెల్లించాలని గతంలోనే సుప్రీం కోర్టు అనిల్ అంబానీని ఉద్దేశించి తీర్పునిచ్చింది. నాలుగు వారాల్లో రూ.450కోట్ల బకాయిలు చెల్లించకపోతే జైలు శిక్ష విధించాలని కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
గత ఏడాది డిసెంబర్ 15నాటికి ఎరిక్సన్ సంస్థకు మొత్తం బకాయిలు చెల్లించాలని చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. డబ్బులు ఆలస్యంగా చెల్లించేందుకు ఈ మొత్తానికి ఏడాదికి 12శాతం వడ్డీని కలిపి ఎరిక్సన్ సంస్థకు చెల్లించాలని పేర్కొంది. అయితే తమకు చెల్లించాల్సిన రూ.450కోట్ల బకాయిలను చెల్లించడంలో రిలయన్స్ గ్రూప్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ మళ్లీ ఆ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమకు చెల్లించాల్సిన నిధులు వెంటనే ఇప్పించాలని కోర్టును ఎరిక్సన్ సంస్థ కోరడంతో తాజాగా విచారించిన కోర్టు బుధవారం ఉత్తర్వులను విడుదల చేసింది. ఆ సంస్థకు చెల్లించాల్సిన డబ్బులను నాలుగు వారాల్లో చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష తప్పదని అనిల్ అంబానీకి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు కోర్టు ధిక్కరణ కింద అనిల్ అంబానీకి కోటి రూపాయాల జరిమానా విధించింది.
రిలయన్స్ పీకల్లోతు నష్టాల్లో ఉండడం.. అనిల్ అంబానీకి డబ్బు పుట్టే పరపతి లేకపోవడంతో ఈ డబ్బు ఎలా చెల్లిస్తాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు వారాల్లో డబ్బులు చెల్లించకపోతే ఇక జైలు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. రియలన్స్ సంస్థ ఇప్పటికే అప్పుల్లో కురుకుపోవడంతో ఇంత పెద్దమొత్తం డబ్బులు ఎలా సర్దుబాటు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ తన అన్న ముఖేష్ అంబానీ సాయం కోరితే ఏదైనా ఫలితం ఉండొచ్చు. లేకపోతే పీకల్లోతు అప్పులకు తోడు జైలు శిక్ష కూడా పడితే అనిల్ అంబానీ వ్యాపారం రోడ్డున పడటం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ విషయంలో అనిల్ అంబానీ ఏవిధంగా ముందుకెళుతారనేది వేచి చూడాలి మరీ..