Begin typing your search above and press return to search.
నేను హామీ ఇవ్వలేదు.. అన్నను చూసి నేర్చుకుంటున్న అనిల్ అంబానీ
By: Tupaki Desk | 25 Jun 2020 12:30 AM GMTఇటీవల ఎస్‌బీఐ ప్రముఖ పారిశ్రామికవేత్త.. కష్టాల ఊబిలో చిక్కుకున్న అనిల్ అంబానీకి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా అనిల్ స్పందించారు. తాను మూడు చైనా బ్యాంకులకు రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్ కమ్) తీసుకున్న రుణాలకు తాను వ్యక్తిగతంగా హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. చైనా బ్యాంకులకు ఆర్.కామ్ 717 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.5,400 కోట్లు చెల్లించాల్సిందిగా బ్రిటన్ కోర్టు అనిల్ అంబానీని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి తీసుకున్న రుణాలకు వ్యక్తిగత హామీని ఇచ్చినట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో తనకు సంబంధం లేదని తెలిపారు.
అవి కార్పొరేట్ రుణాలు ఎస్బీఐ, చైనా బ్యాంకులు తనపై దాఖలు చేసిన వ్యాజ్యం వ్యక్తిగత రుణాలకు సంబంధించింది కాదని, అది కార్పొరేట్ రుణాలకు సంబంధించినదని అనిల్ అంబానీ పేర్కొన్నారు. ఇటీవల రూ.1200 కోట్ల రికవరీ కోసం ఎస్బీఐ... ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. ఈ రెండు కేసులు అంటే ఎస్బీఐ, చైనా బ్యాంకుల అంశంలో గ్రూప్ కంపెనీ మాత్రమే రుణాలు తీసుకుందని అనిల్ అంబానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన రిలయన్స్ ఇన్ఫ్రా ఏజీఎంలో మాట్లాడారు. ఎనిమిదేళ్ల క్రితం రిలయన్స్ కమ్యూనికేషన్స్ తీసుకున్న కార్పొరేట్ రుణానికి నాన్ బైండింగ్ లేఖలో మాత్రమే పరిమితమైన పవర్ ఆఫ్ అటార్నీ సంతకం చేసినట్లు వివరించారు.
చైనా బ్యాంకులు చెబుతున్నట్లు వ్యక్తిగత హామీ మీద ఎలాంటి సంతకం చేయలేదని, ఆ బ్యాంకుల వాదనపై న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా తెలిపింది. బ్రిటన్ కోర్టులో 100 మిలియన్ డాలర్ల వ్యక్తిగత డిపాజిట్ చేయలేకపోవడంతో వాదించేందుకు వీల్లేకుండా పోయిందని తెలిపింది. భారీ రుణాలు ఆర్.కామ్‌కు ఇచ్చిన 925 మిలియన్ డాలర్ల రుణాన్ని రికవరీ చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ ఆఫ్ చైనా, చైనా డెవలప్‌మెంట్ బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంకు ఆఫ్ చైనాలు అనిల్ అంబానీపై బ్రిటన్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. మే 22న మూడు బ్యాంకులకు 21 రోజుల్లో 717 మిలియన్ డాలర్లు చెల్లించాలని అనిల్ అంబానీకి కోర్టు ఆదేశించింది. అయితే తన ఆస్తులు సున్నా అని అనిల్ అంబానీ కోర్టుకు తెలిపారు. అయితే అతని వాదనతో కోర్టు ఏకీభవించలేదు. అయితే మొత్తానికి తాను వ్యక్తిగత గ్యారెంటీ ఇవ్వలేదని అనిల్ అంబానీ చెబుతున్నారు.
ఆర్.కామ్. రూ.46,000 కోట్ల అప్పుల్లో ఉంది. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీల్లో ప్రమోటర్ల వాటా పెంచుకోవాలని నిర్ణయించినట్లు అనిల్ అంబానీ తెలిపారు. గత వారం ప్రిఫరెన్షియల్ కేటాయింపు ద్వారా 10 శాతం వరకు వాటా పెంచుకునేందుకు సెబీ అనుమతించింది. గత మార్చి నాటికి రిలయన్స్ ఇన్ఫ్రాలో 14.7 శాతం, రిలయన్స్ పవర్‌లో 19.29 శాతం వాటా చొప్పున ప్రమోటర్లకు వాటాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇన్ఫ్రా రుణ రహిత సంస్థగా మారుతుందని తెలిపారు. ఈ కంపెనీకి రూ.6,000 కోట్ల రుణాలు ఉన్నాయి. ఆస్తుల విక్రయం ద్వారా రుణభారం తగ్గించుకోనున్నారు. అనిల్ అన్న ముఖేష్ అంబానీ జియో ప్లాట్‌ఫాంలో వాటాల విక్రయం ద్వారా రుణరహిత సంస్థగా నిలబెట్టిన విషయం తెలిసిందే.