Begin typing your search above and press return to search.

ముఖేష్‌ తో డీల్ విఫ‌లం...అనిల్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   4 Feb 2019 6:51 AM GMT
ముఖేష్‌ తో డీల్ విఫ‌లం...అనిల్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
X
దాదాపు రూ.45,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆర్‌ కామ్ అధినేత అనిల్ అంబానీ వీటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆర్‌ కామ్‌ ఆస్తులను విక్రయించి బ్యాంకులకు - సప్లయిర్లకు బకాయిలు చెల్లిస్తామని హామీలు గుప్పించి ఆస్తులు విక్రయించడంతో విఫలం చెందింది. దీంతో గత వారం దివాలాకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించింది. దీని ప్ర‌కారం, అనిల్‌ అంబానీకి చెందిన టెలికం కంపెనీ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యూనల్‌ ఎన్‌ సీఎల్‌ టిని ఆశ్రయించనున్నట్లు ఆదివారం నాడు తెలిపింది. ట్రిబ్యునల్‌ ముందు కూడా కోర్టు వెలుపల ఎలాంటి పరిష్కారం చేసుకోవాలని ప్రతిపాదించామో అదే ప్రతిపాదనను ఎన్‌ సీఎల్‌ టి ముందుంచుతామని ఆర్‌కామ్‌ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఆర్‌ కామ్‌ యాజమాన్యం గతంలో ఎన్‌ సీఎల్‌ టి కోర్టు వెలుపల ఈ కేసును పరిష్కరించుకుంటామని హామీ ఇచ్చింది. అదే ప్రతిపాదనను మళ్లీ ఎన్‌ సీఎల్‌ టి ముందు బకాయిలు ఎలా తీరుస్తామో ఒక ప్రణాళికను సిద్ధం కేసు దివాలా కోర్టుకు అందజేస్తామని ఆర్‌ కామ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

త‌న సోద‌రుడి కంపెనీతో వ్యాపార లావాదేవీలు విజ‌య‌వంతం కాక‌పోవ‌డం వ‌ల్లే అనిల్ అంబానీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అప్పుల నుంచి బయటపడేందుకు ఆన్న ముఖేష్‌ అంబానీని ఆశ్రయించి ఆర్‌ కామ్‌ స్పెక్ట్రమ్‌ ఆస్తులను రిలయన్స్‌ జియోకు విక్రయించడంలో కూడా అనిల్‌ అంబానీ విఫలం అయ్యారు. ఒక వేళ ఈ ఒప్పందం కుదిరి ఉంటే అనిల్‌ కు అప్పుల నుంచి కాస్తా ఉపశమనం లభించేది. ఆర్‌ కామ్‌ స్పెక్ట్రమ్‌ ను జియోకు విక్రయించి రూ.975 కోట్లు సేకరించాలని అంచనా వేసింది. ఆ మొత్తంలో రూ.550 కోట్లు టెలికం తయారీ కంపెనీ ఎరిక్‌ సన్‌ కు చెల్లిం చేసి - మిగిలిన రూ.230 కోట్లు రిలయన్స్‌ ఇన్‌ ఫ్రాటెల్‌ మైనారిటీ వాటాదారులకు చెల్లించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఆర్‌ కామ్‌ ఆస్తులు కొనుగోలు చేయడానికి రిలయన్స్‌ జియో ఒక షరతు విధించింది. ఆర్‌ కామ్‌ ఆస్తులు కొనుగోలు చేసినా.. భవిష్యత్తులో డిపార్టుమెంట్‌ ఆఫ్‌ టెలికం తమకు ఆర్‌ కామ్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేయరాదనే కండిషన్‌ విధించింది. ఆర్‌ కామ్‌ ఆప్పులకు తాము బాధ్యులం కాదని, దీనికి డాట్‌ నుంచి సర్టిఫికేట్‌ తీసుకురావాల్సిందిగా ఆర్‌కామ్‌ను జియో కోరడంతో సీన్‌ మళ్లి రివర్స్‌ అయ్యింది. యధపూర్వక స్థితికి వచ్చి చేరింది. ఈ తలనొప్పులన్నీ ఎందుకని ఆర్‌ కామ్‌ బోర్డు ఈ సమస్యనుంచి త్వరగా బయటపడేందుకు ఎన్‌ సీఎల్‌ టిని ఆశ్రయించింది. ఎన్‌ సీఎల్‌ టి ద్వారా త్వరగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని - ఆస్తులను వీలైనంత త్వరగా విక్రయించుకొని లేదా ఎవరైనా కొనుగోలు చేస్తే వచ్చిన డబ్బును బకాయిలు తీర్చి బయటపడాలని చూస్తున్నట్లు ఆర్‌ కామ్‌ ప్రకటనలో వివరించింది.

కాగా, కంపెనీలో జరుగుతున్న తాజా పరిణామాలపై విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం… కంపెనీ ఆస్తులను విక్రయించి బ్యాంకులకు - సరఫరా దార్లకు చెల్లించాలని నిర్ణయించింది. అయితే కంపెనీ ఆస్తులను విక్రయించాలంటే బ్యాంకులు కానీ సరఫరా దార్ల నుంచి అనుమతులు దక్కించకోవడం పెద్ద తలనొప్పి అని - ఆస్తులను విక్రయించి బకాయిలు తీరుద్దామంటే బ్యాంకు లు ఈ ఆస్తులను విక్రయించకుండా అడ్డుపుల్లలు వేయడంతో బకాయిలు తీర్చలేకపోతున్నమని భావించి ఎట్టకేలకు ఎన్‌ సీఎల్‌ టిని ఆశ్రయించి ఆస్తులను విక్రయించి ఏ బ్యాంకు ఎంత మొత్తం చెల్లిస్తామో లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఆస్తుల విక్రయానికి అనుమతి దక్కించుకోవాలనేది ఆర్‌ కామ్‌ ప్రయత్నమని చెబుతున్నారు.