Begin typing your search above and press return to search.

అప్పు తీర్చడానికి వాటిని అమ్మకానికి పెట్టిన అనిల్ అంబానీ !

By:  Tupaki Desk   |   12 May 2020 11:50 AM GMT
అప్పు తీర్చడానికి వాటిని అమ్మకానికి పెట్టిన అనిల్ అంబానీ !
X
రిలయన్స్ అడాగ్ అధినేత అనిల్ అంబానీకి చెందిన ఢిల్లీ పవర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అమ్మకానికి ఉందట. దీన్ని కొనుగోలు చేసేందుకు దాదాపు 8 మంది ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారట. క్యాస్ డీ డీపోట్ యాక్టిస్ ఎల్ ఎల్ ‌పీ అండ్ బ్రూక్ ‌ఫీల్డ్స్ అసెట్ మేనేజ్‌ మెంట్ సహా వివిధ సంస్థలు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌ కు చెందిన ఢిల్లీ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నాయని తెలుస్తోంది.అలాగే వీటితో పాటుగా గ్రీన్‌ కో ఎనర్జీ హోల్డింగ్స్, ఎనెల్ గ్రూప్, ఐ స్క్వేర్డ్ కేపిటల్, టోరెంట్ పౌడర్ అండ్ వేడ్ క్యాపిటల్ గ్రూప్ ఎల్ఎల్‌సీ తదితర ఎనిమిది సంస్థలు కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయని అంటున్నారు.

BSES రాజ్‌ధాని పవర్ లిమిటెడ్ (BRPL), BSES యమనా పవర్ లిమిటెడ్ (BYPL)లో 51 శాతం వాటాను విక్రయించేందుకు బయ్యర్స్‌ ను గుర్తించేందు కోసం ఇప్పటికే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్... KPMGని నియమించుకుంది. ఈ రెండు విద్యుత్ పంపిణీ వ్యాపారాలు దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 4.4 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.18,800 కోట్లకు తన ముంబై సిటీ పవర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌ ను అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ ‌కు అమ్మేందుకు ప్లాన్ చేసింది.

అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తన రుణాలు తగ్గించుకోవడం కోసం ఆస్తులు విక్రయిస్తోంది. కాగా, దీనిపై రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికార ప్రతినిధి స్పందించాల్సి ఉంది. కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్న కంపెనీలు కూడా స్పందించాల్సి ఉంది. మే 8న మార్చ్ క్వార్టర్ ఫలితాల సందర్భంగా.. వచ్చే ఏడాది నాటికి జీరో డెబిట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.