Begin typing your search above and press return to search.

అంబానీకి ఘోర అవమానం.. దావాకు రెడీ

By:  Tupaki Desk   |   1 Oct 2019 9:26 AM GMT
అంబానీకి ఘోర అవమానం.. దావాకు రెడీ
X
మొన్నటికి మొన్న భారత్ లోనే అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ నిర్వహించిన వాటాదారుల సమావేశం పండుగలా జరిగింది. కోట్ల లాభాలతో వాటాదారులంతా ముఖేష్ ను ఆకాశానికెత్తేశారు. ఈ క్రమంలోనే దేశంలోకి ‘జియో ఫైబర్’ బ్రాండ్ బ్యాండ్ ను లాంచ్ చేశారు ముఖేష్ అంబానీ.. కానీ తాజాగా ఆయన తమ్ముడు రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి మాత్రం తన కంపెనీల వాటాదారుల సమావేశంలో ఘోర అవమానం ఎదురైంది.

అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల వాటాదారుల సమావేశం తాజాగా జరగగా.. వాటాదారులు అనిల్ అంబానీకి చుక్కలు చూపించినట్టు తెలిసింది. కంపెనీలు పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోవడానికి అనిల్ అంబానీయే కారణమని వాటాదారులంతా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ఒక వాటాదారుడు అయితే అనిల్ అంబానీని నమ్మి తాను మూడు కంపెనీల షేర్లలో తన కష్టార్జితం రూ.3 కోట్లు మదుపు చేశానని.. ఇఫ్పుడా షేర్లు 90శాతం పడిపోయాయని వాపోయాడు.. అనిల్ అంబానీ తన 80శాతం షేర్లను తాకట్టు పెట్టడం వల్లే ఇలా జరిగిందని వాటాదారుల సమావేశంలో కడిగిపారేసినట్టు తెలిసింది. మీరు కనుక తన సొమ్ముపై వివరణ ఇవ్వకపోతే 10శాతం వాటాదారులతో కలిసి కంపెనీపై ‘ క్లాస్ యాక్షన్ కేసు’ను కోర్టులో ఫైల్ చేస్తానని హెచ్చరించారు. దీని ద్వారా తనకు పరిహారం లభించేలా పోరాడుతానని స్పష్టం చేశాడు. ఈ వాటాదారుడు ఇంత విమర్శిస్తున్నా అనిల్ అంబానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడం విశేషం.

అనిల్ అంబానీ కంపెనీల విలువ ఆరంభంలో లక్ష కోట్లు దాటింది.దీంతో చాలా మంది కోట్లు పెట్టుబడిగా పెట్టారు. కానీ ఇప్పుడు అన్ని కంపెనీల మార్కెట్ విలువ రూ.18,525 కోట్లకు పడిపోయింది.

దేశంలోనే ఓ కంపెనీపై ఇలాంటి ‘ క్లాస్ యాక్షన్ కేసు’ దావా ఎప్పుడూ ఎవరూ వేయలేదు.. యజమాని లేదా కంపెనీ చర్యల వల్ల వాటాదారులు నష్టపోతే వారికి కంపెనీయే పరిహారం ఇవ్వడం ఈ క్లాస్ యాక్షన్ చట్టం ముఖ్య ఉద్దేశం. 2013లో కంపెనీల చట్టం చేశాక.. బహుషా ఇప్పుడే అనిల్ అంబానీపై దేశంలో ఓ వాటాదారుడు వేస్తానన్న తొలి కేసుగా చెబుతున్నారు.ఈ కేసు ఫైల్ అయితే అనిల్ అంబానీ పరువు దేశవ్యాప్తంగా పోవడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.