Begin typing your search above and press return to search.
కేసు విషయంలో వెనక్కి తగ్గిన అంబానీ!
By: Tupaki Desk | 22 May 2019 5:19 AM GMTఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులపై వేసిన పరువునష్టం దావా విషయంలో వెనక్కి తగ్గారు. రఫేల్ యుద్ధ విమానాల విషయంలో తప్పులు దొర్లినట్లుగా కాంగ్రెస్ ఆరోపించటం తెలిసిందే.
నిబంధనలకు విరుద్ధంగా అనిల్ అంబానీకి ప్రయోజనం కలిగించే రీతిలో రఫేల్ డీల్ ఉందన్న విషయంపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలుచేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు.. నేషనల్ హెరాల్డ్ పత్రికపైన అనిల్ అంబానీకి చెందిన కంపెనీ పరువు నష్టం దావా వేశారు. రూ.5వేల కోట్ల నష్టపరిహారాన్ని కోరుతూ ఆయన అహ్మాదాబాద్ లోని సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో కేసు వేశారు.
తాజాగా ఆ కేసును వెనక్కి తీసుకోవాలని అనిల్ అంబానీ కంపెనీ నిర్ణయించింది. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఆరోపణలు చేస్తున్నట్లు భావించామని.. అందుకే తాము దాఖలు చేసిన పరువు నష్టం కేసును ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం తీసుకున్నట్లు రిలయన్స్ గ్రూపు వెల్లడించింది. ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందే అంబానీ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా ఉందని చెప్పక తప్పదు. చూస్తుంటే.. ఈ కేసు వెనక్కి తీసుకోవటం వెనుక కచ్ఛితంగా ఏదో వ్యూహం ఉందని భావిస్తున్నారు.