Begin typing your search above and press return to search.

అటు అనిల్ ఇటు అంబ‌టి మ‌ధ్య‌లో పోలవ‌రం ? ఎనీ డౌట్స్

By:  Tupaki Desk   |   24 April 2022 2:30 AM GMT
అటు అనిల్ ఇటు అంబ‌టి మ‌ధ్య‌లో పోలవ‌రం ? ఎనీ డౌట్స్
X
పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఉంది. ఇది ఒక బ‌హుళార్థ సాధ‌క ప్రాజెక్టు అని తెలిసే మాట్లాడుతున్నారా లేకా తెలియ‌కుండానే నోటికి ఎంత మాట వ‌స్తే అంత మాట అంటున్నారా? అన్న‌ది ఇప్ప‌టి సందేహం. ఎందుకంటే ప్రాజెక్టుకు సంబంధించి క‌నీస వివ‌రాలు ఎవ్వ‌రి ద‌గ్గ‌రా లేవు. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్ప‌టిదాకా ఎంత ఖ‌ర్చ‌యింది. ఎందుకు ఖ‌ర్చు అయింది అన్న‌ది కూడా చెప్ప‌లేరు. ఇక‌పై చెప్ప‌బోరు కూడా ! ఎందుకంటే ఆ స‌బ్జెక్టే బోరు క‌నుక ! ఇక ప్రాజెక్టు రీ డిజైనింగ్ కు సంబంధించి ఏమ‌యినా ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయా అందుకు కేంద్రం ఏమ‌ని ఆలోచిస్తుంది అన్న‌ది కూడా చెప్ప‌లేరు.

ఏ స్పష్ట‌తా లేకుండా గ‌తంలోనూ ఇప్పుడూ జ‌ల‌వ‌న‌రుల శాఖ‌ను నిర్వ‌హిస్తున్న మంత్రులు మాట్లాడ‌డ‌మే విడ్డూరం మ‌రియు విచార‌క‌రం కూడా ! పోల‌వ‌రం ప్రాజెక్టుకు, ప‌ట్టిసీమ‌కు తేడా ఏమ‌యినా తెలుసా ? ఆ విధంగా అయినా వీళ్ల‌కు ఓ అవ‌గాహ‌న ఉందా ? కాలువల త‌వ్వ‌కం ఎంత వ‌ర‌కూ .. అదేవిధంగా సాగు నీరు ఎంత వ‌ర‌కూ తాగు నీరు ఎంత వ‌ర‌కూ అంటే ఏయే ప్రాంతాల‌కు అన్న‌ది అయినా వీళ్ల‌కు తెలుసా ?

అంటే ఓ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రులు ఇంతటి అవ‌గాహ‌న లేమితో ఉంటే విప‌క్షాలు కానీ మీడియా కానీ ప్ర‌శ్నించ‌కూడ‌దు. ప్ర‌శ్నించ‌డం పాపం ఇక వ్య‌క్తిత్వ హ‌న‌న‌న‌మే ! ఈనాడు లేదా ఆంధ్ర‌జ్యోతి త‌ప్పులు రాస్తే అవి త‌ప్పు లు కాదు అని ఆధారాల‌తో స‌హా మాట్లాడాలి కానీ ఆ రెండు మీడియాల‌ను తిడితే ఏం రాదు. ఆ మాట‌కు వ‌స్తే తిడితే ప‌నులు కావు.

ఇక నిన్న‌టి వ‌ర‌కూ జ‌ల‌వ‌న‌రుల శాఖ‌ను నిర్వ‌ర్తించిన అనిల్ కుమార్ యాద‌వ్ (నెల్లూరు ఎమ్మెల్యే) మాట‌లు కూడా విడ్డూరంగానే ఉన్నాయి. స‌ర్.. పోల‌వ‌రం పై స్పందించండి అంటే అది నా ప‌ని కాదు అని త‌ప్పుకున్నారు. మూడేళ్ల కాల వ్య‌వ‌ధిలో మ‌ట్టి ప‌నులు ఎందాక లేదా కాంక్రీట్ వ‌ర్క్ ఎందాక ? 2019 వ‌ర‌ద‌ల ప్ర‌భావం ఎందాక ? వీటిపై ఇప్పుడు అంబ‌టి మాట్లాడితే సంతోషం.

కానీ వీటిపై కాకుండా టు ద పాయింట్ మాట్లాడ‌కుండా ఏవేవో చెబుతున్నారు. కాంట్రాక్ట‌ర్లే అవినీతి చేశారు అందుకు టీడీపీనే సాయం చేసింది ఇలాంటి మాట‌లు చెప్ప‌డంలో అంబ‌టి ముందుంటున్నారు.

పోనీ వాటికి ఆధారాలు ఉన్నాయా.. ప్రాథ‌మికంగా ఓ ప‌నిలో 400 కోట్ల రూపాయ‌లు అవినీతి అయిందే అనుకుందాం.. దానిపై న్యాయ విచార‌ణ‌కు ఆదేశించాలి క‌దా ! అస‌లు పోల‌వ‌రం ప‌నుల‌కు సంబంధించి ఆడిటింగ్ ప‌క్కాగా ఉందా లేదా ఈ విష‌య‌మైనా మంత్రికి తెలుసా? బాధ్య‌త గ‌ల మంత్రి బాధ్య‌త‌లు అందుకుని ప‌ది రోజులు అయినా ఇంకా నేను తెలుసుకోవాలి అని చెప్ప‌డం త‌ప్పు కాదు కానీ అదే ప‌నిగా విప‌క్ష పార్టీల‌ను తిట్ట‌డం వ‌ల్ల మాటల్లో డొల్ల‌త‌నమే త‌ప్ప చేత‌ల్లో ఏమీ చేత‌గాని ప్ర‌భుత్వం ఇది అని త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయి. త‌త్ ఫ‌లితంగా జ‌గన్ స‌ర్కారు ఇర‌కాటంలో ప‌డుతుంది. ఈ పాటి కూడా ఆయ‌న ఆలోచించకుండా మాట్లాడుతున్నారే ?