Begin typing your search above and press return to search.
ఆనం ముందస్తు ఎన్నికలపై అనిల్ ఫైర్
By: Tupaki Desk | 4 Jan 2023 6:16 AM GMTముందస్తు ఎన్నికల విషయం ఏపీలో ఆసక్తిని రేపుతోంది. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. సీఎంజగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని.. పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది. ఇటీవల సీఎం జగన్.. ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధాని మోడీని కలుసుకున్నప్పుడు కూడా.. ఏపీలో ముందస్తు ఎన్నికలపై చర్చించారనే విశ్లేషణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీలోని కొందరు నాయకులు దీనిని ప్రస్తావించారు.
ఇలా..నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా ముందస్తు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే.. ఇక, తాము ఇంటికి వెళ్లడ మేనని అన్నారు. సహజంగానే వైసీపీలో ఉంటూ.. ఆ పార్టీ విధానాలను విమర్శించడం సరికాదనే అభిప్రాయం వెల్లడైంది. ఆది నుంచి కూడా.. తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆనం.. ఇటీవల కాలంలో కొంత బయట పడుతున్నారు.
ఇలా.. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆయన ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింతగా మంట పుట్టించాయి. ఇక, ఈ వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ యువ నాయకుడు, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఆనంకు చురకలు అంటించారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని.. ఆనం కలగన్నారేమో.. అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ముందస్తు ముచ్చటపై ఆయన ఎక్కడైనా జ్యోతిష్యం చెప్పించుకున్నారా? అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం ముందే జరుగుతాయని, 2024లోనే ఎన్నికలకు వెళ్తామని అనిల్ చెప్పారు.అదేసమయంలో టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించి తీరుతామన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.