Begin typing your search above and press return to search.
ఈసారి నెగ్గడం కష్టమే అంటున్న వైసీపీ మాజీ మంత్రి?
By: Tupaki Desk | 12 Jan 2023 2:54 AM GMTఇది జగన్ సర్వే కాదు, ఆయన మార్క్ వర్క్ షాప్ హెచ్చరిక అంతకంటే కాదు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. అవును లోతుకు దిగితే కానీ ఎంత అడుగున పడ్డామో అర్ధం కాదు. ఇపుడు వైసీపీ ఎమ్మెల్యేలకు అదే జరుగుతోంది. అసలు విషయం బోధపడేసరికి కధ కంచికి చేరుతోంది. జగన్ సీఎం కాగానే తొలి విడత మంత్రుల జాబితాలో నెల్లూరు సిటీకి చెందిన ఎమ్మెల్యే యువనేత అనిల్ కుమార్ యాదవ్ లక్కీగా బెర్త్ కొట్టేశారు.
అంతే కాదు కీలకమైన జలవనరుల శాఖను కూడా చేజిక్కించుకున్నారు. అంతే ఆయన శాఖ సంగతి ఎలా ఉన్నా నోటికి పనిచెప్పేవారు. జగన్ భజనపరుడిగా ముద్రవేసుకున్నారు. వారూ వీరూ అని చూడకుండా అందరి మీద కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఈ లోగా మూడేళ్ళ పుణ్య కాలం ముగిసింది. జగన్ మలి విడత విస్తరణలో ఆయన బెర్త్ కోల్పోయారు.
అంతే నాటి నుంచి ఆయనలో ఒక పక్క అసంతృప్తి మొదలైంది. మరో వైపు అమాత్య హోదా చేజారడంతో ఆయన హంగూ ఆర్భాటం దర్జా కూడా పక్కకు పోయాయి. ఇక ఆయన వెంట అప్పటిదాకా కనిపించే అనుచరవర్గంలో కూడా భారీ చీలిక వచ్చింది. అనుచరులు కూడా ఎవరికి వారు తప్పుకున్నారు. బలమైన నేతలే ఆయనను వీడిపోయారు. నెల్లూరు సిటీని మంత్రిగా పట్టించుకోనందుకు ఫలితాన్ని ఇపుడు ఆయన చూస్తున్నారు. గడప గడపకూ తిరుగుతూంటే కాళ్ళ పీకులతో పాటు పార్టీలో లోటుపాట్లు తెలుసుకుని ఆయనే కంగారు పడుతున్నారు, బేజారు అవుతున్నారు.
ఈ నేపధ్యంలో నిస్పృహ తో పాటు నీరసం ఆవహించిన ఆవేశంతో ఆయన అంటున్న మాటలు చేస్తున్న ప్రకటనలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఆయన అన్న మాటలు వింటే జగనే ఆశ్చర్యపోవాల్సి వస్తుందేమో. జగన్ తనకు మంత్రి పదవి ఇవ్వకుండా పీకేసి మంచి పని చేశారు అని అనిల్ అంటున్నారు. తనను అలా మాజీని చేయడం వల్లనే తన వారు ఎవరో పరవారు ఎవరో తెలుసుకునే అవకాశం వచ్చిందని ఆయన అంటున్నారు.
తన వెంట ఉండాల్సిన బలమైన నాయకులు కార్పోరేటర్లు ఇపుడు కనిపించకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్న వారు ఉంటారు లేని వారు ఉండరు ఇది ఇంతే అని కూడా వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు. రాజకీయాల్లో ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు అంటున్నారు. తన విషయమే తీసుకుంటే తనకు 2014లో ఇలాగే కొందరు నాయకులు గెలవకుండా దెబ్బెశారని ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకున్నారు.
అయితే ప్రజల తోడు ఉంటే గెలుపు సాధ్యమే అని ఆయన అంటూ 2019 ఎన్నికల్లో తన ప్రత్యర్ధి 180 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా తనదే విజయం అయిందని అన్నారు. ఇక తాజాగా ఆర్య వైశ్య సంఘం నేతలు సమావేశం పెట్టి తనను పిలవకపోవడం పైన గుస్సా అయ్యారు. అక్కడ అంతా వంద కోట్లకు పైగా పడగలెత్తిన వారేనని తాను మాత్రమే వెయిట్ లేనివాడిని అనే పక్కన పెట్టారు అని నిస్ఠూరమాడారు. తనకు ఈసారి గెలుపు కష్టమే అన్న మాట ఈ మాజీ మంత్రి నోట రావడం విశేషంగా చెప్పుకోవాలి.
అయినా తాను ఎవరికీ ఏ రకమైన అన్యాయం చేయలేదని, తన వెంట ప్రజలు ఉన్నారని ఆయన తనకు తానుగా ధైర్యం చెప్పుకున్నారు. మొత్తానికి చూస్తే అనిల్ కుమార్ కి మాజీ మంత్రి అయిన తరువాత చాలా తత్వం బోధపడింది అని అంటున్నారు.
ఇక ప్రత్యర్ధులు అయితే ఆయన ఇపుడు సరిగ్గా నేల మీదకు వచ్చారని సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా తాను నెగ్గడం కష్టమే అని ఒక మాజీ మంత్రి అంటున్నారు అంటే అది ఆయనకే కాదు జగన్ సర్కార్ కి కూడా డేంజర్ బెల్స్ ని మోగించే అంశమే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.