Begin typing your search above and press return to search.

బాబుపై కొడాలి తీవ్ర వ్యాఖ్యలు.. రాజధానిలో పందులు.. కుక్కలు.. గొర్రెలే తిరిగేది

By:  Tupaki Desk   |   27 Nov 2019 5:52 AM GMT
బాబుపై కొడాలి తీవ్ర వ్యాఖ్యలు.. రాజధానిలో పందులు.. కుక్కలు.. గొర్రెలే తిరిగేది
X
టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు మీద మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి కొడాలి నాని. ఒకప్పుడు తన బాస్ అయిన చంద్రబాబును ఇప్పటివరకూ ఎవరూ తిట్టలేనంత ఘాటుగా తిట్టేశారు. ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించాలన్న నిర్ణయాన్ని ప్రకటించిన చంద్రబాబు ప్రకటన నేపథ్యంలో ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాజధానిలో ఏముందని చూడటానికి చంద్రబాబు వెళుతున్నారు? నాలుగు భవనాలు.. తుప్పలు.. ముళ్ల పొదలు తప్ప ఏమున్నాయి? వాటిని చూడ్డాటానికి వెళుతున్నారా? అంటూ మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలలో చంద్రబాబు ఏం చేశారు? అమరావతి.. పోలవరంపై నిరంతరం సమీక్షలు చేయటం మినహా ఏమైనా అభివృద్ధి పనులు చేశారా? అని ప్రశ్నించారు.

వైఎస్సార్ కుటుంబాన్ని విమర్శించటం మానుకోవాలని ఎంత చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు. బాబు ఒక పప్పు చెక్క అని.. లోకేశ్ ఒక పప్పు అని పేర్కొన్నారు. రాజధానిలో పందులు.. కుక్కులు.. గొర్రెలు లాంటి పశువులు తిరుగుతున్నాయని.. అలాగే చంద్రబాబు తిరుగుతాడేమో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వాన్ని విమర్శించటం మానేసి.. ఎన్నికల్లో తామెందుకు ఓడామన్న విషయాన్ని బుర్రన్న నేతలతో కలిసి బాబు సమీక్షించుకోవాలన్నారు.

ఆరునెలల్లో ఇల్లే కట్టలేం.. అలాంటిది రాజధాని కట్టగలమా? కొంత టైమిచ్చి చూడాలన్న కొడాలి నాని.. సాయంత్రం ఆరు గంటల తర్వాత రాజధానిలో శ్మశాన నిశ్శబ్దతే ఉంటుందని.. ఆ మాటే మంత్రి బొత్స అన్నారన్నారు. జగన్ మాత్రమే కాదు.. వైఎస్సార్ మొదలు రాజారెడ్డి వరకూ అందరిని విమర్శించటం మొదలు పెట్టింది చంద్రబాబేనని చెప్పారు. ఇటీవల కాలంలో చంద్రబాబును ఈ స్థాయిలో దునుమాడి నేత ఎవరూ లేరని చెప్పాలి. అది కూడా.. ఒకప్పుడు బాబు పార్టీలో సుదీర్ఘంగా సాగిన నేత.. ఇంతపరుషంగా మాట్లాడటాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.