Begin typing your search above and press return to search.

అంజలి బిర్లా అడ్డదారిలో ఐఏఎస్ కాలేదు..

By:  Tupaki Desk   |   20 Jan 2021 1:30 AM GMT
అంజలి బిర్లా అడ్డదారిలో ఐఏఎస్ కాలేదు..
X
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ఐఏఎస్‌గా సెలక్ట్ కావడం వెనుక అధికార దుర్వినియోగం ఉందనే చర్చ కొంతకాలంగా కొనసాగుతోంది. సోషల్‌ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని అంజలి మెయిన్స్‌ పరీక్ష రాయకుండానే అడ్డదారిలో ఐఏఎస్‌కు ఎంపికయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం రాజకీయ విమర్శలకు కూడా దారి తీస్తోంది. అయితే.. 'ఫ్యాక్ట్‌ చెక్'‌ అనే సంస్థ అవన్నీ పుకార్లని స్పష్టం చేసింది. కావాల్సి వస్తే యూపీఎస్సీలో పరిశీలించవచ్చని ట్వీట్‌ చేసింది.

అంజలి బిర్లాపై వచ్చిన ఆరోపణలను నిశితంగా పరిశీలించినట్టు ఫ్యాక్ట్ చెక్ సంస్థ వెల్లడించింది. ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే యూపీఎస్సీ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చని ప్రకటించింది. పరీక్ష రాయకుండానే ఐఏఎస్‌గా ఎంపికైందని చెబుతున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పింది. ఈ సందర్భంగా వెబ్‌సైట్‌లో అంజలి బిర్లాకు వచ్చిన మార్కులను కూడా షేర్‌ చేసింది.