Begin typing your search above and press return to search.

ట్రోలింగ్ ​పై అంజలి బిర్లా.. స్ట్రాంగ్​ కౌంటర్​..!

By:  Tupaki Desk   |   22 Jan 2021 4:30 AM GMT
ట్రోలింగ్ ​పై అంజలి బిర్లా.. స్ట్రాంగ్​ కౌంటర్​..!
X
సెలబ్రిటిలు, వాళ్ల పిల్లలపై సోషల్​మీడియాలో తప్పుడు వార్తలు ట్రోల్​ చేయడం ఈ మధ్య కామన్​ అయిపోయింది. కొంతమంది ఆ వార్తలను లైట్​ తీసుకుంటుంటే .. మరికొంతమంది వాటికి స్ట్రాంగ్​గా కౌంటర్లు ఇస్తున్నారు. అయితే నెటిజన్లు కూడా నిజానిజాలను తెలుసుకోకుండా తప్పుడు వార్తలనే ఎక్కువగా నమ్ముతున్నారు. తాజాగా జరిగిన ఉదంతమే అందుకు ఉదాహరణ. లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా కూతురు అంజలీ భార్య ఇటీవల ఐఏఎస్​ పరీక్ష పాసయ్యారు. అయితే ఆమె కష్టపడి చదివి మంచి ర్యాంక్​ తెచ్చుకొని ఐఏఎస్​ సాధించారు. కానీ కొందరు ఆకతాయిలు మాత్రం ఆమె ఐఏఎస్​ పరీక్ష రాయలేదని.. కేవలం తండ్రి అండదండలతో ఐఏఎస్​ సాధించారంటూ సోషల్​మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్​చేశారు. ఈ సమాచారం విపరీతంగా ట్రోల్​ అయ్యింది.

దీంతో అంజలీ బిర్లా నేరుగా రంగంలోకి దిగి తనపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని ఆధారాలతో సహా నిరూపించారు. ఫ్యాక్ట్‌ చెక్‌ (నిజనిర్ధారణ) సంస్థ ఇది తప్పుడు వార్త అని తేల్చిచెప్పింది కూడా. అయినప్పటికీ ట్రోలింగ్​ ఆగలేదు. దీంతో అంజలి బిర్లా నేరుగా రంగంలోకి దిగారు. తాను ఎక్కడెక్కడ పరీక్షలు రాసింది. ఎన్నిమార్కులు వచ్చింది. ఇలా పూర్తివివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా అంజలి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఎంత నిజాయితీగా ఉంటానో నా సన్నిహితులకు తెలుసు. కానీ కొంతమంది నా మీద దుష్ప్రచారం చేశారు. ట్రోలింగ్​ చేసిన వాళ్లను ఇప్పుడు పట్టుకోగలిగాం. కానీ ట్రోలింగ్​కు వ్యతిరేకంగా ఓ చట్టం తీసుకురావాలన్నది నా అభిప్రాయం. ఇవాళ నేను బాధితురాలిని అయ్యాను. రేపు మరొకరు కావచ్చు.

నా ట్రోలింగ్​ నాకు మంచే చేసింది. భవిష్యత్​లో నాకు ఇటువంటి ఘటనలు అనేకం ఎదురుకావచ్చు. వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు ఈ అనుభవం నాకు ఎంతో ఉపయోగపడుతుంది. నేను కష్టపడి చదివి సాధించుకున్న ఉద్యోగంపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది’. మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్​కు పాల్పడిన వారికి ఆమె గట్టిగానే కౌంటర్​ ఇచ్చారు. వ్యక్తులపై కాకపోయినా.. కనీసం వ్యవస్థలపైనైనా గౌరవం ఉంచాలంటూ ఆమె హితవు పలికారు.