Begin typing your search above and press return to search.

తెలంగాణ ఇన్‌ఛార్జి డీజీపీగా అంజ‌నీ కుమార్..!

By:  Tupaki Desk   |   29 Dec 2022 4:04 PM GMT
తెలంగాణ ఇన్‌ఛార్జి డీజీపీగా అంజ‌నీ కుమార్..!
X
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర డీజీపీగా కొనసాగుతున్న మహేందర్ రెడ్డి ఎల్లుండి పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆయన స్థానంలో ఏసీబీ డీజీ అంజనీ కుమార్ ను రాష్ట్ర ఇన్ ఛార్జి డీజీపీగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.

తెలంగాణ డీజీపీ నియామకంలో పలు న్యాయపరమైన సమస్యలు ఉండటంతోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అదేవిధంగా పలువురు ఐపీఎస్ అధికారులను సైతం బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

వీరిలో పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ను సీఐడీ అడిషనల్ డీజీగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మహేష్ భగవత్ రాచకొండ సీపీగా కొనసాగారు. ప్రస్తుతం ఆయన స్థానంలో రాచకొండ కమిషనర్ గా దేవేంద్ర సింగ్ చౌహాన్‌ ను ప్రభుత్వం నియమించింది.

అలాగే ఏసీబీ డీజీగా ర‌వి గుప్తా నియమాకం అయ్యారు. రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి డీజీగా జితేంద‌ర్.. శాంతి భద్రతల అద‌న‌పు డీజీగా సంజ‌య్ కుమార్ జైన్ లను ప్రభుత్వం అవకాశం కల్పించింది. వీరి నియామకం ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జారీ చేశారు.

రెండ్రోజుల్లో తెలంగాణ డీజీపీ పదవీ నుంచి విరమణ చెందుతున్న డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఇన్ చార్జిగా డీజీపీగా అంజనీ కుమార్ నియామకం కాగా.. త్వరలోనే పూర్తి స్థాయి డీజీపీ ఎవరనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.