Begin typing your search above and press return to search.
మోడీపై పెద్దాయనకు భ్రమలు తొలిగాయ్!
By: Tupaki Desk | 6 Jan 2018 4:19 AM GMTగుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ.. ప్రధాని అభ్యర్థిగా భాజపా తరఫున నియమితులు అయినప్పుడు.. 2014 ఎన్నికల ప్రచారానికి ముమ్మరంగా సాగుతున్నప్పుడు.. భాజపా భావజాలంతో ఏకీభవించకపోయినా.. ఆయన ప్రధాని అయితే.. నిజాయితీగల పాలన వస్తుందని, కొన్ని మంచి నిర్ణయాలు వస్తాయని భావించిన వారు దేశంలో ఎందరో ఉన్నారు. తటస్థులు - మేధావులు కూడా పలువురు మోడీ పాలన కోసం ఎదురుచూశారు. అయితే ఆయన పాలన మొదలై నాలుగేళ్లు పూర్తవుతున్న ప్రస్తుత తరుణంలో.. అలాంటి వారందరూ మోడీ మీద పెట్టుకున్న ఆశలన్నీ భ్రమలేనని తేలిపోతున్నాయని అర్థమవుతోంది. దేశంలోనే విలువలకు పెద్దపీట వేసే గాంధేయవాది - సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా తాజాగా మోడీ పనితీరు మీద పెదవి విరవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. తాను డిమాండ్ చేస్తున్న లోక్ పాల్ - లోకాయుక్త విషయంలో సరైన బిల్లులు తీసుకురాకుంటే.. మార్చి 23 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ అన్నాహజారే కొత్త హెచ్చరిక చేశారు.
దేశంలో రాజకీయ అవినీతికి సైతం చెక్ పెట్టగల లోక్ పాల్ - లోకాయుక్త వ్యవస్థలను కార్యరూపంలోకి తీసుకురావడం గురించి సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తొలినుంచి పోరాటం సాగిస్తున్నారు. ఇందుకోసం ఆయన అనేకమార్లు శాంతియుత దీక్షలను చేశారు కూడా. ప్రభుత్వాలు మాత్రం పెద్దగా స్పందించలేదు. తాజాగా అన్నా హజారే మాట్లాడుతూ.. ‘‘మోడీ ప్రభుత్వం రాజకీయ వ్యవస్థలో మార్పులు తెస్తుందని - దేశాన్ని అవినీతి రహితంగా మారుస్తుందని తాను ఆశించానని - తన ఆశలు నెరవేరలేదని’’ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆ మాటకొస్తే.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కూడా.. లోక్ పాల్ నియామకం చేపట్టాలని అంటున్నారు. నాలుగేళ్ల కిందటే చట్టం చేసినా.. నియామకం విషయంలో మోడీ సర్కార్ జాప్యం చేస్తున్నదనేది ఆయన వాదన. ఈ విషయంలో మోడీ ప్రభుత్వానివి బూటకపు విధానాలంటూ ట్విటర్ ద్వారా ఎద్దేవా చేశారు. అయితే అన్నా హజారే చెబుతున్న ప్రకారం.. లోక్ పాల్ బిల్లు సరైన రూపంలో లేదన్నది అర్థమవుతోంది. కాంగ్రెస్, భాజపాలు కలిసి ఈ బిల్లును నీరుగార్చాయనేది ఆయన వాదన. అందుకే.. ‘సరైన’ లోక్ పాల్ బిల్లు ప్రవేశపెట్టి దానిని చట్టంగా తేవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జనంలో నిజాయితీపరుడిగా మంచిపేరు ఉన్న అన్నా హజారే వంటి పెద్దాయన మోడీ సర్కారు పనితీరు మీద ఈ రేంజిలో అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషమే.