Begin typing your search above and press return to search.

త్వరలో అన్నాహజారే మరో ఉద్యమం

By:  Tupaki Desk   |   7 Nov 2016 8:37 AM GMT
త్వరలో అన్నాహజారే మరో ఉద్యమం
X
గాంధేయవాది - ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నాహజారే మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు. నిన్నమొన్నటి వరకూ అనేకరకాల సమస్యలపై ఉద్యమించిన ఈయన... ఇక నుంచి మద్యపాన నిషేధంపై ఉద్యమించనున్నట్లు ప్రకటించారు. భారతదేశంలో మధ్యపాన నిషేధం సాధ్యమవుతుందా? దేశంలో చాలా రాష్ట్రాలు కేవలం మద్యపాన అమ్మకాల వల్ల వచ్చే లాభాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్న రోజుల్లో ఈ నిషేధం సాధ్యమేనా? అసాధ్యాలను సుసాధ్యం చేయడానికి చేసేదే ఉద్యమం కాబట్టి... అన్నాహజారే మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ నిషేధంపై చట్టం వచ్చేంతవరకూ తన పోరాటం ఆగదని తెలిపారు!

మహారాష్ట్రలోని పుణెలో ఒక ఎన్జీవో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన హజారే... మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు - మహిళలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారని.. అందుకే దానికి వ్యతిరేకంగా పోరాడతానని స్పష్టం చేశారు. "నా తర్వాతి ఉద్యమం మద్యపానం నిషేధంపైనే... ఈ నిషేధంపై చట్టం తీసుకొచ్చేంతవరకు పోరాడుతూనే ఉంటాను" అని జజారే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే ముసాయిదాను తయారు చేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు అందించామని చెప్పిన హజారే.. ఆయన కూడా మద్యపాన నిషేధ చట్టానికి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా ముసాయిదాను పటిష్టంగా రూపొందించేందుకు సాయం చేయాల్సిందిగా అదే వేదికపై ఉన్న కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి మాధవ్ గాడ్‌ బొలేను హజారే కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/