Begin typing your search above and press return to search.

టెంకాయ కొట్టి ఫీల్ అయిన ప‌వ‌న్ వైఫ్

By:  Tupaki Desk   |   22 Jan 2018 5:35 AM GMT
టెంకాయ కొట్టి ఫీల్ అయిన ప‌వ‌న్ వైఫ్
X
తెలంగాణలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టార్ట్ చేసిన ప్ర‌జాయాత్ర అనూహ్యంగా మొద‌లైంది. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌వ‌న్ అనుస‌రించిన వైఖ‌రికి భిన్నంగా ఆయ‌న ఇప్పుడు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మూడు.. నాలుగు రోజుల పాటు సాగే తెలంగాణ యాత్ర‌ను షురూ చేయ‌టం కోసం పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చారు. ఎప్పుడూ లేని రీతిలో జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో మ‌హిళ‌ల‌తో నిండింది.

ఊహించ‌ని రీతిలో ప‌వ‌న్ త‌న స‌తీమ‌ణితో క‌లిసి పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చారు. అనంత‌రం ఆమె ప‌వ‌న్ కు తిల‌కం దిద్ది.. హార‌తి ఇచ్చారు. వీరిద్ద‌రికి గుమ్మ‌డి కాయ‌తో దిష్టి తీశారు. ఈ కార్య‌క్ర‌మం మొత్తం జ‌న‌సేన అభిమానుల్ని విప‌రీతంగా అల‌రించింది.

ఇక‌.. త‌న తెలంగాణ టూర్‌కు వినియోగించ‌నున్న వైట్‌కారుకు.. దిష్టి తీసే కార్య‌క్ర‌మాన్ని ప‌వ‌న్ స‌తీమ‌ణి అన్నా లెజినోవా ప్ర‌త్యేకంగా చేశారు. కొబ్బ‌రికాయ‌ను మూడు సార్లు తిప్పి బ‌లంగా కొట్టారు. అయితే.. కొబ్బ‌రికాయ ప‌గ‌ల్లేదు. దీంతో.. ఒక్క‌సారిగా ఆమె త‌న చేతిని నోటికి అడ్డు పెడ్డుకొని.. అయ్యో ఇలా జ‌రిగిందేమిటి? అన్న‌ట్లుగా హావ‌భావాల్ని ప్ర‌ద‌ర్శించారు.

అయితే.. ఆమె ప‌క్క‌నున్న వ్య‌క్తి ఏం ఫ‌ర్లేద‌ని చెప్ప‌టంతో పాటు.. మ‌రో కొబ్బ‌రికాయ‌ను ఇచ్చారు. దీన్ని మ‌రోసారి బ‌లంగా నేల‌కొసి కొట్టారు అన్నా. ఈ సారి టెంకాయ ప‌గ‌ట‌లంతో అన్నా సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. అనంత‌రం ప‌వ‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఆమెను అప్యాయంగా హ‌త్తుకున్న ప‌వ‌న్‌.. త‌న తెలంగాణ ప‌ర్య‌ట‌న‌ను షురూ చేశారు.