Begin typing your search above and press return to search.

అన్నా రాంబాబు..టీడీపీకి అలా దొరికాడు!

By:  Tupaki Desk   |   4 Aug 2019 6:45 AM GMT
అన్నా రాంబాబు..టీడీపీకి అలా దొరికాడు!
X
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నా రాంబాబు వీడియో ఒకటి తెలుగుదేశం వర్గాల మధ్యన వైరల్ గా మారింది. ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం అభిమానులు షేర్ చేస్తూ ఉన్నారు. తను ఎమ్మెల్యే మాత్రమే కాదు - కాంట్రాక్టర్ ను కూడా అని ఆ వీడియోలోనే చెప్పుకున్న అన్నా రాంబాబు పనులు నాసిరకంగా చేయడం గురించి చెప్పుకున్నారు.

తను రాజకీయ నేతను అనే విషయాన్ని పక్కన పెడితే కాంట్రాక్టర్ ను కూడా అనే విషయాన్ని అన్నా రాంబాబు గుర్తు చేశారు ఆ ఇంటర్వ్యూలో. తను రాజకీయ నేతగా మాట్లాడటం లేదని కాంట్రాక్టర్ గా మాట్లాడుతున్నానంటూ చెప్పుకొచ్చారు. తాము కూడా డబ్బులు సంపాదించుకోవడానికే కాంట్రాక్టులు చేస్తామంటూ అన్నా రాంబాబు వ్యాఖ్యానించారు.

అయితే పనుల విషయంలో అధికారులకు - అనేక మందిక ముడుపులు చెల్లించుకోవాల్సి ఉంటుందన్నట్టుగా మాట్లాడారు. అలా అందరికీ లంచాలు ఇవ్వడానికి డబ్బులు ఖర్చు అవుతాయని - తీరా ఆ ప్రభావం పనుల మీద పడుతుందని అన్నారు. అందరికీ లంచాలు ఇచ్చి పనులు నాసిరకంగా చేయాల్సి ఉంటుందని - అప్పుడే తమకు నాలుగు రూపాయలు మిగులుతాయని అన్నా రాంబాబు కుండబద్ధలు కొట్టినట్టుగా మాట్లాడారు.

ప్రస్తుతం ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము అధికారులు చేతులు తడిపి - నాసిరకంగా పనులు చేసి డబ్బులు మిగుల్చుకుంటామని ఆయన చెబుతున్నట్టుగా ఉండే వీడియోను ఆ వర్గాలు బాగా షేర్ చేస్తూ ఉన్నాయి. ఇలా ఒక వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం వర్గాలకు సోషల్ మీడియాలో దొరికారు.